సమంత అక్కినేని ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అక్కినేని ఇంటి కోడలైన తర్వాత ఈమె కెరీర్ మూడు హిట్లు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఇంకోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసే విధానం చూసి మిగతా ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఈ భామ ఒక ఇంగ్లీష్ పత్రిక నిర్వహించే పోల్‌లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ అవార్డులపై కొన్ని విమర్శలు వచ్చినా.. నిజంగానే సమంత మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అనే చెప్పాలి. ఈ యేడాది దిల్ రాజు నిర్మాణంలో చేసిన ‘జాను’తో పలకరించింది. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా తర్వాత మరో తమిళ సినిమాలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పింది. దాంతో పాటు ఓ రియాలిటీ షో చేయనున్నట్టు సమాచారం.
తాజాగా ఈ యేడాది సమంత నటించిన ‘జాను’తో నిరాశ పరిచినా.. ఆమె నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్ 2 త్వరలో ప్రేక్షకుల ముందు రానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన విడుదల తేదీని త్వరలో అనౌన్స్ చేయనున్నరన్న మాట. అంటే సినిమాలతో ప్రేక్షకులను అలరించిలేకపోయినా... సమంత.. ఇపుడు ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌లో విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో అభిమానులను కనువిందు చేయనున్నదన్న మాట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon prime, Samantha akkineni, Telugu Cinema, Tollywood, Web Series