సమంత అక్కినేని నిజంగానే ఆ దర్శకులకు చుక్కలు చూపిస్తుందా..?

పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. కానీ సమంత అక్కినేని అది చేసి చూపిస్తుంది. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారంటే అది చిన్న విషయం అయితే కాదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 5, 2019, 3:34 PM IST
సమంత అక్కినేని నిజంగానే ఆ దర్శకులకు చుక్కలు చూపిస్తుందా..?
సమంత అక్కినేని ఫైల్ ఫోటో Instagram.com/samantharuthprabhuoffl
  • Share this:
పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. కానీ సమంత అక్కినేని అది చేసి చూపిస్తుంది. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారంటే అది చిన్న విషయం అయితే కాదు. స్యామ్ ఊ అనాలే గానీ వరసగా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా సమంతతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులు కథలు రాసుకుంటున్నారు. యూ టర్న్, ఓ బేబీ సినిమాలకు మంచి టాక్ రావడం.. ఓ బేబీ కమర్షియల్‌గా కూడా సక్సెస్ కావడంతో ఇప్పుడు సమంత వైపు చూపులు పడుతున్నాయి.
Samantha Akkineni wants Powerful Stories from new directors and She makes changes in it pk పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. కానీ సమంత అక్కినేని అది చేసి చూపిస్తుంది. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారంటే అది చిన్న విషయం అయితే కాదు. samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni movies,samantha akkineni instagram,samantha akkineni u turn,samantha akkineni super deluxe,samantha akkineni new directors,samantha akkineni hot images,samantha akkineni hot photos,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని దర్శకులు,సమంత అక్కినేని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు,తెలుగు సినిమా
సమంత (Instagram/samantharuthprabhuoffl

ఆమెను ఒప్పించి సినిమాలు చేయాలనుకుంటున్నారు. దాని వెనక కూడా ప్లాన్ ఉంది. సమంతతో లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే 10 నుంచి 15 కోట్ల మధ్యలో అయిపోతుంది. ఆమె పారితోషికం 3 కోట్ల వరకు వెళ్లినా కూడా థియెట్రికల్ బిజినెస్ 20 కోట్ల వరకు అవుతుంది. పైగా శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ కలిపి మరో 15 కోట్ల వరకు వస్తున్నాయి. అంటే సమంతతో సినిమా చేస్తే 35 కోట్ల వరకు బిజినెస్ అయితే ఖాయం. అందుకే ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు నిర్మాతలు.

Samantha Akkineni wants Powerful Stories from new directors and She makes changes in it pk పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. కానీ సమంత అక్కినేని అది చేసి చూపిస్తుంది. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారంటే అది చిన్న విషయం అయితే కాదు. samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni movies,samantha akkineni instagram,samantha akkineni u turn,samantha akkineni super deluxe,samantha akkineni new directors,samantha akkineni hot images,samantha akkineni hot photos,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని దర్శకులు,సమంత అక్కినేని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు,తెలుగు సినిమా
సమంత అక్కినేని (Source: Twitter)

కానీ ఇప్పుడు సమంతతో సినిమా చేయడానికి ఓ సమస్య అడ్డొస్తుంది. తనకు ఓ బేబీ, సూపర్ డీలక్స్ లాంటి పవర్ ఫుల్ కథలు వస్తేనే చేస్తానని చెప్పడంతో కొందరు దర్శకులు కథలు కూడా చెప్పకుండానే వెనుదిరిగి వెళ్లిపోతున్నారని తెలుస్తుంది. మరోవైపు సమంత కూడా కథల విషయంలో కాస్త మార్పులు చెబుతుందని.. ఆమె చెప్పినట్లు కథలను మారిస్తే తప్ప డేట్స్ ఇవ్వనని చెబుతున్నట్లు ఆమెపై ఇండస్ట్రీలో నెగిటివ్ ప్రచారం అయితే మొదలైంది. మరి దీనికి ఆమె ఏమంటుందో చూడాలిక.

First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>