పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది సమంత అక్కినేని. 96 సినిమాను పూర్తి చేసి ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ 2 షూటింగ్‌లో బిజీగా ఉంది సమంత. ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణలో కాస్త గ్యాప్ దొరకడంతో తిరుపతికి వచ్చింది సమంత అక్కినేని. తన స్నేహితురాలు, RJ రమ్యతో కలిసి తిరుమలకు వచ్చింది స్యామ్. తిరుపతి నుంచి కాలిబాటన తిరుమలకు చేరుకుంది సమంత అక్కినేని. తిరుమలలో ఇలా కాలినడకన స్వామివారిని చేరుకోవడం సమంతకు ఇదే తొలిసారి కాదు. గతంలో మజిలీ సమయంలో కూడా ఇలాగే తిరుమల కొండపై దర్శనమిచ్చింది.
అప్పుడు కూడా అలిపిరి నుంచి కాలి నడక మార్గంలో కొండ ఎక్కింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా ఇదే చేసింది సమంత. తిరుమల వచ్చినప్పుడల్లా కాలినడకన వస్తే తనకు హాయిగా ఉంటుందని.. మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతుంది సమంత. అక్కినేని కోడలు రావడంతో ఆమెతో దారి పొడవునా అభిమానులు కూడా ఉత్సాహంగా నడిచారు. ఇక సమంత కూడా అలిపిరి నుంచి తిరుమల వరకు ఎలాంటి అలుపు లేకుండా చాలా వేగంగా తన గమ్యాన్ని చేరుకుంది. గత కొన్ని రోజులుగా ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ చిత్రీకరణతో బిజీగా ఉంది స్యామ్.
దాంతో పాటు శర్వానంద్ హీరోగా వస్తున్న 96 రీమేక్‌లో కూడా నటిస్తుంది. తను నటిస్తున్న ప్రాజెక్టులు అన్నీ విజయం సాధించాలనే ధృడ నిశ్చయంతో ఆ వేంకటేశ్వరుడి ఆశీస్సులు కూడా అందుకోవాలని తిరుమలకు వచ్చింది సమంత. అన్నట్లు త్వరలోనే చైతూతో మరో సినిమా కూడా చేయబోతుందనే ప్రచారం జరుగుతుంది. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకోవాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha akkineni, Telugu Cinema, Tirumala Temple, Tollywood