SAMANTHA AKKINENI VERY BUSY AFTER THE MARRIAGE ALSO AND SHE ACCEPTED ONE MORE MOVIE NOW PK
సమంత అక్కినేని మరో సంచలనం.. అలా మహాసముద్రంలో..
Instagram.com/samantharuthprabhuoffl/
పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ మిగిలిన హీరోయిన్లకు సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది సమంత అక్కినేని. ఇప్పటికీ ఈమె కోసం కథలు రాస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం 96..
పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ మిగిలిన హీరోయిన్లకు సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది సమంత అక్కినేని. ఇప్పటికీ ఈమె కోసం కథలు రాస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం 96 తెలుగు రీమేక్ జానులో నటిస్తుంది ఈ బ్యూటీ. దాంతో పాటే హిందీలో ది ఫ్యామిలీ మెన్ 2 లో కూడా నటిస్తుంది. ఇది ఆమెకు తొలి వెబ్ సిరీస్. ఈ రెండూ ఇలా ఉండగానే మరో సినిమాకు కూడా ఇప్పుడు సమంత ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతుంది. 2019 సమంతకు బాగానే కలిసొచ్చింది. భర్తతో కలిసి నటించిన మజిలి.. సొంతంగా నటించిన ఓ బేబీ విజయం సాధించాయి.
శర్వానంద్, సమంత *‘జాను’ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)
ఇక ఇప్పుడు శర్వానంద్ సినిమాతో వచ్చేస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించబోయే రెండో సినిమా మహాసముద్రంలో సమంత హీరోయిన్గా నటించబోతుందని తెలుస్తుంది. ఈయన చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ముందు రవితేజ.. ఆ తర్వాత నాగ చైతన్య పేర్లు వినిపించినా ఇప్పుడు శర్వానంద్ వచ్చి చేరాడు.
సమంత అక్కినేని ఫైల్ ఫోటో
మరో కీలక పాత్రలో దర్శకుడు అజయ్ భూపతి నటిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో శర్వాకు జోడీగా మరోసారి సమంత నటించబోతుందని తెలుస్తుంది. ఏదేమైనా కూడా అజయ్ భూపతి లాంటి బోల్డ్ డైరెక్టర్ సినిమాలో నటించడం అంటే మాటలు కాదు.. అందుకే సమంత ఏం చేసినా కూడా సంచలనమే అవుతుంది. మరి మహాసముద్రంలో సమంత అక్కినేని పాత్ర ఎలా ఉండబోతుందో..?
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.