మామ నాగార్జున బాటలో అక్కినేని కోడలు సమంత..

అక్కినేని ఇంటి కోడలు అయిన తర్వాత సమంత దూకుడు మాములుగా లేదు. ఒకవైపు సినిమాలు..మరోవైపు కుటుంబానికి తగినంత ప్రాధ్యానత ఇస్తోంది. తాజాగా సమంత.. తన మామయ్య బాటలో..

news18-telugu
Updated: November 27, 2019, 10:41 AM IST
మామ నాగార్జున బాటలో అక్కినేని కోడలు సమంత..
నాగార్జున సమంత నాగ చైతన్య
  • Share this:
అక్కినేని ఇంటి కోడలు అయిన తర్వాత సమంత దూకుడు మాములుగా లేదు. ఒకవైపు సినిమాలు..మరోవైపు కుటుంబానికి తగినంత ప్రాధ్యానత ఇస్తోంది. అంతేకాదు పెళ్లి తర్వాత సమంత దూకుడు సక్సెస్ రేటు కూడా పెరిగింది. ఈ యేడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమాతో సక్సెస్ అందుకుంది సమంత. ఆ తర్వాత ‘ఓ బేబి’ తో సోలో హిట్టును తన అకౌంట్‌లో వేసుకుంది. తాజాగా సమంత.. తన మామయ్య బాటలో సొంత ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తమ ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోస్ ఉండనే ఉంది. దాంతో పాటు సమంత కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన కొత్త కొత్త ఐడియాలతో వచ్చేవాళ్లకు సినిమా అవకాశాలను ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు తన  నిర్మాణంలో వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రొడక్షన్ హౌస్‌ను  తన భర్త నాగ చైతన్య పేరుతో పాటు తన నేమ్ కలిసేచ్చేలా పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు అక్కినేని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>