సమంత అక్కినేని సాయం తీసుకుంటున్న నాగశౌర్య..

ఛలో సినిమా తర్వాత సరైన విజయం కోసం చూస్తున్నాడు నాగశౌర్య. ఆ తర్వాత నటించిన సినిమాలు అంచనాలు అందుకోకపోవడంతో మళ్లీ డైలమాలో పడిపోయాడు ఈ కుర్ర హీరో. ఈ ఏడాది సమంతతో కలిసి నటించిన..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 26, 2019, 11:07 PM IST
సమంత అక్కినేని సాయం తీసుకుంటున్న నాగశౌర్య..
సమంత చేతుల మీదుగా లాంఛ్ కానున్న అశ్వథ్థామ టీజర్
  • Share this:
ఛలో సినిమా తర్వాత సరైన విజయం కోసం చూస్తున్నాడు నాగశౌర్య. ఆ తర్వాత నటించిన సినిమాలు అంచనాలు అందుకోకపోవడంతో మళ్లీ డైలమాలో పడిపోయాడు ఈ కుర్ర హీరో. ఈ ఏడాది సమంతతో కలిసి నటించిన ఓ బేబీ సినిమా విజయం సాధించినా కూడా అది లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. ప్రస్తుతం ఈయన తన సొంత ప్రొడక్షన్‌లో 'అశ్వథ్థామ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ డిసెంబర్ 27న విడుదల కానుంది. ఉదయం 11 గంటల 7 నిమిషాలకు సమంత చేతుల మీదుగా విడుదల చేస్తామని పోస్టర్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
సమంత చేతుల మీదుగా లాంఛ్ కానున్న అశ్వథ్థామ టీజర్

ఓ బేబీ సినిమా నుంచి నాగశౌర్యతో సమంతకు మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు అదే స్నేహాన్ని తన సినిమా కోసం వాడేసుకుంటున్నాడు శౌర్య. ఈ సినిమా కథ కూడా సమంతకు బాగా నచ్చడంతో నాగశౌర్యకు హెల్ప్ చేస్తుంది. పైగా ఈ చిత్ర కథ కూడా నాగశౌర్యే రాయడం విశేషం. అశ్వథ్థామ సినిమాతో రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మెహ్రీన్ నటిస్తోంది. అశ్వద్ధామ సినిమాను శౌర్య అమ్మ ఉష మూల్పూరి నిర్మిస్తుండగా.. అతడి నాన్న శంకర్ ప్రసాద్ సమర్పిస్తున్నారు. జనవరి 31న విడుదల కానుంది ఈ చిత్రం.
Published by: Praveen Kumar Vadla
First published: December 26, 2019, 11:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading