Naga Chaitanya- Samantha: చైత‌న్య సినిమాలో స‌మంత కెమెరా అప్పియ‌రెన్స్

Naga Chaitanya- Samantha: నాగ చైత‌న్య- స‌మంత అభిమానుల‌కు ఇది నిజంగా శుభవార్తే. చై మూవీలో సామ్ కెమెరా అప్పియ‌రెన్స్ ఇవ్వ‌నుందా.. అంటే అవున‌నే మాట‌లే వినిపిస్తున్నాయి. అస‌లు వివ‌రాల్లోకి వెళితే.. చైతూ ప్ర‌స్తుతం థ్యాంక్యు అనే చిత్రంలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.

Naga Chaitanya- Samantha: నాగ చైత‌న్య- స‌మంత అభిమానుల‌కు ఇది నిజంగా శుభవార్తే. చై మూవీలో సామ్ కెమెరా అప్పియ‌రెన్స్ ఇవ్వ‌నుందా.. అంటే అవున‌నే మాట‌లే వినిపిస్తున్నాయి. అస‌లు వివ‌రాల్లోకి వెళితే.. చైతూ ప్ర‌స్తుతం థ్యాంక్యు అనే చిత్రంలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.

 • Share this:
  Naga Chaitanya- Samantha: నాగ చైత‌న్య- స‌మంత అభిమానుల‌కు ఇది నిజంగా శుభవార్తే. చై మూవీలో సామ్ కెమెరా అప్పియ‌రెన్స్ ఇవ్వ‌నుందా.. అంటే అవున‌నే మాట‌లే వినిపిస్తున్నాయి. అస‌లు వివ‌రాల్లోకి వెళితే.. చైతూ ప్ర‌స్తుతం థ్యాంక్యు అనే చిత్రంలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ మూవీకి విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజు నిర్మ‌స్తోన్న ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం అందింస్తున్నారు. ఇందులో చైత‌న్య స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్లు రొమాన్స్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తుండ‌గా.. అందులో ఒక‌రు నిత్యా మీన‌న్ అని స‌మాచారం. ఇక ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ రాజ‌మండ్రిలో శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

  ఇదిలా ఉంటే ఇందులో ఒక కీల‌క పాత్ర ఉంద‌ట‌. ఆ పాత్ర‌ను స‌మంత చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే చై-సామ్ అభిమానుల‌కు శుభ‌వార్తే. కాగా ఏమాయ చేశావే మూవీలో చై, స‌మంత తొలిసారిగా క‌లిసి న‌టించారు. ఆ సినిమా స‌మయంలోనే ఈ ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ త‌రువాత మ‌నం, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌జిలీ చిత్రాల్లో క‌లిసి న‌టించారు. ఇక స‌మంత న‌టించిన ఓ బేబి మూవీలో చై కెమెరా అప్పియ‌రెన్స్ ఇచ్చారు. ఇక ఇప్పుడు థ్యాంక్యులో స‌మంత క‌న్ఫ‌ర్మ్ న‌టించేంది నిజ‌మైతే మ‌రోసారి ఈ జోడీని తెర‌పైన చూసే అవ‌కాశం అభిమానుల‌కు ల‌భిస్తుంది.

  కాగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య న‌టించిన లవ్ స్టోరీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇందులో సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన టీజ‌ర్, పాట‌లు అంద‌రినీ తెగ ఆక‌ట్టుకున్నాయి. ఇటీవ‌ల రిలీజ్ అయిన సారంగ ద‌రియా పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచ‌నాలు ఉన్నాయి. మరోవైపు సమంత, గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పౌరాణిక చిత్రంలో నటించనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో ఇంతవరకు కనిపించని పాత్రలో సమంత నటించనుంది.
  Published by:Manjula S
  First published: