హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Akkineni: సమంత నేతృత్వంలో తెలుగులో మరో ఓటీటీ సంస్థ.. ఆహాకు పోటీగా..

Samantha Akkineni: సమంత నేతృత్వంలో తెలుగులో మరో ఓటీటీ సంస్థ.. ఆహాకు పోటీగా..

Samantha Akkineni about on working with Nayanatara and Vijay Sethupathi

Samantha Akkineni about on working with Nayanatara and Vijay Sethupathi

Samantha Akkineni: ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న సమంత ఆహా ఓటీటీలో ఓ టాక్ షో చేస్తోంది. సామ్ జామ్ పేరుతో వస్తోన్న ఈ షోలో టాలీవుడ్ ప్రముఖులను సమంత తనదైన స్టైల్‌లో ఇంటర్వూ చేస్తూ.. క్యూట్ క్యూట్ మాటలతో అలరిస్తోంది.

  Samantha Akkineni : తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది తమిళ పొన్ను సమంత. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. ఇక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న సమంత ఆహా ఓటీటీలో ఓ టాక్ షో చేస్తోంది. సామ్ జామ్ పేరుతో వస్తోన్న ఈ షోలో టాలీవుడ్ ప్రముఖులను సమంత తనదైన స్టైల్‌లో ఇంటర్వూ చేస్తూ.. క్యూట్ క్యూట్ మాటలతో అలరిస్తోంది. అది అలా ఉంటే ఈ భామ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వార్త ఏమంటే.. ఓపక్క సినిమాలలో నటిస్తూ .. మరోపక్క వస్త్ర వ్యాపారంలోకి కూడా దిగిన సమంత తాజాగా మరో భారీ వ్యాపారంలోకి దిగుతోంది. ఓటీటీ సంస్థను నెలకొల్పడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నారనీ, ఇందులో సమంత కీలక పాత్ర పోషించనుందనీ తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడికానున్నాయి. ఇక ఇప్పటికే మరో తెలుగు నిర్మాత అల్లు అరవింద్ ఈ ఓటీటీలోకి ప్రవేశించి విజయవంతం అయ్యిన సంగతి తెలిసిందే. చూడాలి మరి అక్కినేని కుంటుంబం ఏమాత్రం విజయం సాధిస్తుందో.. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. ఆమె ఇటీవల శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా తర్వాత సమంత ఏ తెలుగు సినిమాలోను కనిపించలేదు. ఇక సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.


  ఇక మరోవైపు సమంత నాగచైతన్యలు ఇటీవల మాల్దీవ్స్‌ వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి వెకేషన్‌ను ఎంజాయ్ చేశారు. తన భర్త నాగ చైతన్య ఈరోజు 34పుట్టినరోజు సందర్భంగా ఈ జంట అక్కడికి వెళ్లారు. సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేయనున్నాడట. ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుందట. ఈ సంస్థ సమంతతో హర్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమాని ప్లాన్‌ చేసింది. ఈ చిత్రానికి తొలుత శరవణ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించాల్సి ఉండగా.. కొన్ని కారణాలు ఆయన ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను నందిని రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందబోయే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపు పూర్తయ్యాయట. ఈ సినిమాతో పాటు సమంత కన్నడ సినిమా దియాను తెలుగులో రీమేక్‌ చేయనుందట. కన్నడ సినిమా దియాను చూసిన సమంత ఆ రీమేక్‌లో నటించాలనీ కోరుకుంటుందట. ఈ సినిమాపై కొంత క్లారిటీ రావాల్సీ వుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Samantha akkineni, Tollywood news

  ఉత్తమ కథలు