ఫ్యామిలీ మ్యాన్‌తో సమంత... అమెజాన్ ప్రైమ్‌లో అక్కినేని భామ..

Samantha Akkineni : సమంత సినిమాలకు కాస్తా విరామం ఇచ్చి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌ సెకండ్ సీజన్‌లో నటించనున్నారు.

news18-telugu
Updated: October 14, 2019, 7:15 AM IST
ఫ్యామిలీ మ్యాన్‌తో సమంత... అమెజాన్ ప్రైమ్‌లో అక్కినేని భామ..
Instagram/samantharuthprabhuoffl
news18-telugu
Updated: October 14, 2019, 7:15 AM IST
Samantha Akkineni : 'ఏమాయ చేశావే' సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది సమంత. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లి చేసుకుంది సమంత. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు. మరోవైపు  సమంత అక్కినేని... ఇటీవల చేసిన సినిమాలన్నీ  బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. ఈ యేడాది మొదట్లో తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా, రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది.  తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగులో సమంత, శర్వానంద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.



 




Loading...

View this post on Instagram




 

And it’s a wrap!! Another special film and a role that has challenged me to be better than I was yesterday .. blessed to work with a team that manages to create magic everyday .. Thankyou @premkumardop and #sharwanand for being my dream team .. #Janu ... living my best life ❤️ ...grateful always


A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on





ఈ సినిమాను తమిళంలో డైరెక్ట్ చేసిన జి.ప్రేమ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది. అది అలా ఉంటే సమంత కాస్తా సినిమాలకు విరామం ఇచ్చి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌ సెకండ్ సీజన్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ సీజన్ ప్రసారం అయ్యి.. మంచి హిట్ టాక్ తెచ్చుకోగా.. మొదటి సీజన్‌లో మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌ రెండో సీజన్‌లో సమంత మరో ప్రధాన పాత్ర పోషించనుంది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్‌ సిరీస్‌‌ను దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ ద్వయం హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు తెలుగులో సందీప్ కిషన్, వరుణ్ సందేశ్‌ ప్రధాన పాత్రలో వచ్చిన 'డి ఫర్ దోపిడి' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.



 




View this post on Instagram




 

I love you for always pretending to be as enthusiastic as I am 😂😂 @chayakkineni ❤️❤️ #childrenofthe80s


A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on






 
First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...