Samantha Bigg Boss 4 Telugu: నాగార్జుననే మించిపోయింది.. బిగ్ బాస్‌కు సమంత రికార్డ్ రెమ్యునరేషన్..

Samantha Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది నాగార్జున. గత రెండు సీజన్స్‌గా ఈయన బాగానే అలరిస్తున్నాడు. అయితే నాలుగో సీజన్ మధ్యలో ఉండగానే ఈయన షూటింగ్ కోసం బయటికి వెళ్లిపోయాడు. మూడు వారాల పాటు వైల్డ్ డాగ్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 27, 2020, 9:39 AM IST
Samantha Bigg Boss 4 Telugu: నాగార్జుననే మించిపోయింది.. బిగ్ బాస్‌కు సమంత రికార్డ్ రెమ్యునరేషన్..
నాగార్జున, సమంత (Nagarjuna Samantha)
  • Share this:
బిగ్ బాస్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది నాగార్జున. గత రెండు సీజన్స్‌గా ఈయన బాగానే అలరిస్తున్నాడు. అయితే నాలుగో సీజన్ మధ్యలో ఉండగానే ఈయన షూటింగ్ కోసం బయటికి వెళ్లిపోయాడు. మూడు వారాల పాటు వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్లాడు నాగ్. అక్కడే 21 రోజులు ఉండబోతున్నాడు. అందుకే సీన్‌లోకి సమంత అక్కినేని వచ్చింది. తన బాధ్యతను తన కోడలికి అప్పగించాడు నాగార్జున. ఈమె 5 వారాల పాటు బిగ్ బాస్ షోను హోస్ట్ చేయాల్సి ఉంటుంది. నిజానికి 6 వారాలు చేయాల్సి ఉన్నా కూడా ఒక్క శనివారం ఎలాంటి హోస్ట్ లేకుండా కానిచ్చేసారు. అయితే ఇప్పుడు అందరి ఫోకస్ మాత్రం ఒకే విషయంపై ఉంది. ఈ 5 ఎపిసోడ్స్ కోసం సమంత ఎంత పారితోషికం తీసుకుని ఉంటుందో అని..? దీనికి సమాధానం కూడా వచ్చేసింది. నాగార్జున కంటే ఎక్కువ రెమ్యునరేషన్ సమంత తీసుకుందనే ప్రచారం జరుగుతుంది. కేవలం ఐదు ఎపిసోడ్స్ కోసమే ఈమె ఏకంగా 2.10 కోట్లు తీసుకుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి.
సమంత బిగ్ బాస్ (Samantha Bigg Boss host)
సమంత బిగ్ బాస్ (Samantha Bigg Boss host)

ఈ లెక్కన దాదాపు ఎపిసోడ్‌కు 40 లక్షలకు పైగానే అన్నమాట. సీజన్ అంతా కలిపి నాగార్జున 8 కోట్ల వరకు తీసుకుంటుంటే.. సమంత మాత్రం కేవలం మూడు వారాల కోసమే 2 కోట్లకు పైగా తీసుకుంటుండటం మాత్రం నిజంగానే అద్భుతం. తొలి ఎపిసోడ్ ఏకంగా 4 గంటల పాటు రన్ చేసింది సమంత. పైగా అందరితో కలిసిపోయిన విధానం కూడా అదిరిపోయింది. ఈమెకు కార్తికేయ, అఖిల్ అక్కినేని, పాయల్ రాజ్‌పుత్, హైపర్ ఆది లాంటి సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ చేసారు. మొత్తానికి బిగ్ బాస్ కోసం సమంత తీసుకున్న పారితోషికం హాట్ టాపిక్‌గా మారిపోయింది.
Published by: Praveen Kumar Vadla
First published: October 27, 2020, 9:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading