నెటిజన్స్‌కు సమంత ఛాలెంజ్.. ఏ విషయంలో తెలుసా..

గతంలో లేనట్టుగా చెన్నై మహానగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. దీంతో నీటి సంరక్షించుకోకపోతే.. ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుందన్నదానికి చెన్నై నీటి ఎద్దడి ఒక ఉదాహరణగా నిలిచింది. తాజాగా నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందకు సినీ నటులు కూడా నడుము కట్టారు. తాజాగా సమంత నీటి సంరక్షణ చర్యలో భాగంగా ‘వన్ బకెట్ చాలెంజ్’ ను ట్విట్టర్ వేదికగా స్వీకరించారు.

news18-telugu
Updated: July 19, 2019, 8:48 PM IST
నెటిజన్స్‌కు సమంత ఛాలెంజ్.. ఏ విషయంలో తెలుసా..
సమంత అక్కినేని (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
గతంలో లేనట్టుగా చెన్నై మహానగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. దీంతో నీటి సంరక్షించుకోకపోతే.. ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుందన్నదానికి చెన్నై నీటి ఎద్దడి ఒక ఉదాహరణగా నిలిచింది. తాజాగా నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందకు సినీ నటులు కూడా నడుము కట్టారు. తాజాగా సమంత నీటి సంరక్షణ చర్యలో భాగంగా ‘వన్ బకెట్ చాలెంజ్’ ను ట్విట్టర్ వేదికగా స్వీకరించారు. అంతేకాదు ప్రజలు కూడా నీటిని అతిగా వృథా చేయోద్దని ట్విట్టర్ వేదికగా కోరింది. కొత్తగా సోషల్ మీడియాలో వన్ బకెట్ ఛాలెంజ్ ప్రారంభమైంది.భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా.. ఇప్పటి నుంచే ప్రజలకు నీటి వినియోగంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో దీన్ని ప్రారంభించారు. ఈ ఛాలెంజ్ ప్రకారం ఆదివారం కేవలం ఒక్క బకెట్ నీటిని మాత్రమే వాడాలని కోరింది.

తాజాగా సమంత వన్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించింది. అంతేకాదు నాతో పాటు ఈ ఆదివారం వన్ బకెట్ ఛాలెంజ్‌ను ఎవరు టేకప్ చేస్తారని ఛాలెంజ్ విసిరింది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా  ఎక్కువ టైమ్ స్నానం చేయకూడదు. మీ వెహికల్స్ ను కడగకూడదు. ముఖం కడుక్కోటపుడు నల్లాను ఒదిలేయకూడదు. ఇక సమంత ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ.. నేను నా వన్ బకెట్ ఛాలెంజ్ ఫోటోను పోస్ట చేస్తా. మీరు కూడా చేస్తారు కదూ అంటూ ట్వీట్ చేసింది. ఈ ఛాలెంజ్ పై ఇప్పటికే వరుణ్ తేజ్,నాగ్ అశ్విన్, బెల్లంకొండ శ్రీనివాస్ తదితరులు స్పందించారు. ఇప్పటికే వరుణ్ తేజ్.. వన్ బకెట్ ఛాలెంజ్ పై స్పందించిన సంగతి తెలిసిందే.
First published: July 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>