Samantha Akkineni Remunaration | సమంత అక్కినేని ఆహా ఓటీటీ కోసం హోస్ట్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే కదా. ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కోసం సమంతకు బాగానే పారితోషకం ముట్టిందనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినబడుతున్నాయి. ఓవైపు సినిమాలు.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తూనే సమంత ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు పెళ్లి తర్వాత సమంత సక్సెస్ రేటు కూడా పెరిగింది. గతేడాది భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమాతో సక్సెస్ అందుకుంది సమంత. ఆ తర్వాత ‘ఓ బేబి’ తో సోలో హిట్టును తన అకౌంట్లో వేసుకుంది. ఈ రకంగా అక్కినేని హీరోలు సక్సెస్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే.. సమంత మాత్రం హిట్స్ మీద హిట్స్ అందుకుంటుంది. మరోవైపు తన స్నేహితురాల్లతో కలిసి జూబ్లిహిల్స్‌లో ఓ ప్రీ స్కూల్‌ను కూడా స్టార్ట్ చేసింది. అంతేకాదు వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టి సత్తా చాటింది. అంతేకాదు రీసెంట్గా మామ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం వెళితే.. హౌస్ బాధ్యతలను తనపై వేసుకొని ఈ షోను తనదైన శైలిలో నడిపించి వావ్ అనిపించింది. ఇపుడు ‘ఆహా’ ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తింది. ఇప్పటికే ఆహా ఓటీటీలో సమంత టాక్ షో.. ‘సామ్ జామ్’ స్ట్రీమింగ్ అవుతుంది.
సామ్ జామ్‌లో విజయ్ దేవరకొండను ఇంటర్వ్యూ చేసిన సమంత (Twitter/Photo)
ఈ షో కోసం సమంత దాదాపు 12 ఎపిపోడ్లు చేసింది సమంత. ఒక్కో ఎపిసోడ్‌కు సమంత.. దాదాపు రూ. 15 లక్షల వరకు ఛార్జ్ చేసినట్టు సమాచారం. మొత్తంగా 12 ఎపిసోడ్స్‌కు కలిపి రూ. 1.8 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. ఇదే పారితోషకంలో సినిమా చేయాలంటే యాభై నుంచి అరవై రోజుల వరకు డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. ఈ లెక్కన సమంత ఈ టాక్ షో కోసం భారీగానే వర్కౌట్ అయింది. ఏమైనా హీరోయిన్గా ఒక స్థాయి అందుకున్న తర్వాతకానీ.. ఈ ఇమేజ్ రాదు. అది ఆల్రెడీ సమంతకు ఎపుడో వచ్చేసింది. కాబట్టి సినిమాలతో వచ్చిన క్రేజ్‌ను ఇపుడు సమంత ఈ రకంగా వాడుకుంటున్నట్టు తెలుస్తోంది.