సమంత సర్ఫ్రైజ్ చేసిన నెటిజన్.. ఆనందంలో అక్కినేని కోడలు..

గత కొన్నేళ్లుగా అక్కినేని కోడలు సమంత దూకుడు మాములుగా లేదు. చేసిన సినిమాలు చేసినట్టు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. ఈ రకంగా పెళ్లైన తర్వాత కూడా కథానాయికగా సత్తా చూపెడుతున్న ఈ భామకు ఓ నెటిజన్ సర్ప్రైజ్ చేసాడు.


Updated: July 11, 2019, 5:27 PM IST
సమంత సర్ఫ్రైజ్ చేసిన నెటిజన్.. ఆనందంలో అక్కినేని కోడలు..
సమంత అక్కినేని (Source: Twitter)
  • Share this:
గత కొన్నేళ్లుగా అక్కినేని కోడలు సమంత దూకుడు మాములుగా లేదు. చేసిన సినిమాలు చేసినట్టు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి.  ఈ యేడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా సక్సెస్ మాత్రం సమంతకు సెపరేట్ అని చెప్పాలి. రీసెంట్‌గా ఈ భామ కథానాయికగా నటించిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. ఈ రకంగా పెళ్లైన తర్వాత కూడా కథానాయికగా సత్తా చూపెడుతున్న ఈ భామకు ఓ నెటిజన్ సర్ప్రైజ్ చేసాడు. అంతేకాదు సదరు అభిమాని.. ట్విట్టర్‌లో ఆమె ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఫోటో ఆఫ్ ది డే’ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ ఫోటో చూసి సమంత ఆశ్చర్యపోయింది. అంతేకాదు సదరు నెటిజన్‌కు ఈ ఫోటో మీకెలా దొరికింది  అంటూ ప్రశ్నించింది.మరో అభిమాని కూడా సమంత, తన భర్త నాగ చైతన్య, అఖిల్‌తో కలిపి ఉన్న ఫోటోను షేర్ చేసాడు. ఈ ఫోటోపై సమంత స్పందిస్తూ.. ఆ రోజు మేం ఏం మాట్లాడుకున్నామో ఇప్పటికీ గుర్తు ఉంది అంటూ సమంత ట్వీట్ చేసింది. ప్రస్తుతం సమంత ‘96’ రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటారు. దీంతో పాటు మామ నాగార్జున హీరోగా నటిస్తోన్న ‘మన్మథుడు 2’ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది.

First published: July 11, 2019, 5:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading