news18-telugu
Updated: September 14, 2020, 12:35 PM IST
రకుల్,సారాలకు సమంత సపోర్ట్ (File/Photo)
రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్లకు సమంత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా సపోర్ట్ చేసింది. వివారల్లోకి వెళితే.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం చుట్టూ అల్లుకున్న డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి రియా చక్రవర్తి... మొత్తం 25 మంది సినీ ప్రముఖుల పేర్లను NCB అధికారులకు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. వాటిలో టాలీవుడ్ నటి... రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌తో పాటు పలువురు ప్రముఖు పేర్లు వినిపించాయి. వీళ్ల పేర్లు డ్రగ్స్ కేసులో బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు.. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్‌ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. తాాజగా ఈ కేసులో ఎన్సీబీ అధికారులు స్పందిస్తూ.. మాదక ద్రవ్యాలు సప్లై చేసే ముఠా వివరాలను సేకరించే పనిలో ఉన్నాము. అందులో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు మేం సిద్ధం చేసుకోలేదని చెప్పారు. ఇక డ్రగ్స్ కేసులో రకుల్, సారా అలీ ఖాన్ పేర్లు ఈ కేసుతో అసలు సంబంధమే లేదని తేల్చిపారేశారు. అసలు వాళ్ల పేర్లు ఎలా వచ్చాయో తెలియదన్నారు.

రకుల్, సారాలకు సమంత సపోర్ట్ (Instagram/Photo)
తాజాగా డ్రగ్స్ కేసులో సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు లేవని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపడంతో నెటిజన్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్‌కు సోషల్ మీడియా వేదికగా #NoRakul #NoSara అంటూ సారీ చెబుతున్నారు. తాజాగా వీళ్లిద్దరికి సమంత సపోర్ట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మొత్తంగా ఈ వ్యవహారంలో రకుల్, సారా పేర్లు లేకపోవడంతో వీళ్లిద్దరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
September 14, 2020, 12:34 PM IST