ఈ ఇయర్ తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సూపర్ సక్సెస్ కావడంతో ఫుల్ హ్యాపీలో ఉంది.మరోవైపు తమిళంలో సమంత హీరోయిన్గా నటించిన ‘సూపర్ డీలక్స్’ కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఫుల్ హ్యాపీలో ఉంది. ఇపుడు అదే జోష్‌లో ఈ భామ యాక్ట్ చేసిన ‘ఓ బేబి’ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సమంత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇన్నేళ్ల కెరీర్లో చాలా సినిమాలు చేసినా.. పూర్తి స్థాయి హాస్య చిత్రాన్ని ఇప్పటి వరకు చేయలేదు. ఆ కోరిక ‘ఓ బేబి’ సినిమాతో తీరిందంటూ ఆనందం వ్యక్తం చేసింది. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్,నాగశౌర్య ముఖ్యపాత్రల్లో నటించారు. షూటింగ్ పార్ట్ కంప్లీటైన ఈ సినిమాను జూలై 5న విడుదల చేస్తున్నారు.
అంతేకాదు కొన్ని రోజుల ఒక నిర్ణయం కూడా తీసుకున్నాను. పెళ్లికి ముందు గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులను అలరించాను. పెళ్లైన తర్వాత మాత్రం నా ఆలోచనలో మార్పులు వచ్చాయి. చేస్తే మంచి సినిమాలు చేయాలి. లేకపోతే ఇంట్లో కూర్చోవాలి అని డిసైడ్ అయ్యాను. ఆ నిర్ణయం వల్లే నా నుంచి మంచి చిత్రాలు వచ్చాయని చెప్పుకొచ్చారు.
‘ఓ బేబి’ సినిమా విషయానికొస్తే.. అనుకోకుండా ఆ పెద్దావిడా..పాతికేళ్ల భామగా మారిపోతుంది. ఆమెకు అదెలా సాధ్యమైందనేదే ‘ఓ బేబి’ స్టోరీ. ఈ సినిమాలో ఓల్డ్ లేడీ పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ నటించగా.. యంగ్ పాత్రను సమంత పోషించింది. ఓల్డ్ నుంచి యంగ్ మారడంతో ఏర్పడిన కామెడీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమా కొరియాలో హిట్టైయిన ‘మిస్ గ్రానీ’ రీమేక్‌గా తెరకెక్కించారు. మరి ఈ సినిమాతో సమంత మరోసారి ఆడియన్స్‌ను మాయ చేస్తుందా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nandini Reddy, Oh Baby, Samantha, Suresh Babu, Suresh Productions, Telugu Cinema, Tollywood