విమర్శించే వాళ్లకు సమంత అక్కినేని అదిరిపోయే ఆన్సర్..

Samantha Akkineni: సమంత అక్కినేని, పూజా హెగ్డే మధ్య రెండు రోజులుగా ఆసక్తికరమైన వార్ నడుస్తుంది. తనకు తెలియకుండా తన సోషల్ మీడియాలో పేజీలో ఎవరో హ్యాక్ చేసి సమంత గురించి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 29, 2020, 4:19 PM IST
విమర్శించే వాళ్లకు సమంత అక్కినేని అదిరిపోయే ఆన్సర్..
సమంత అక్కినేని (Instagram/samantharuthprabhuoffl)
  • Share this:
సమంత అక్కినేని, పూజా హెగ్డే మధ్య రెండు రోజులుగా ఆసక్తికరమైన వార్ నడుస్తుంది. తనకు తెలియకుండా తన సోషల్ మీడియాలో పేజీలో ఎవరో హ్యాక్ చేసి సమంత గురించి పోస్ట్ పెట్టారని పూజా చెప్తుంది. మరోవైపు సమంత అభిమానులు మాత్రం తెలిసి చేసినా.. తెలియకుండా చేసినా కూడా అది నీ తప్పే.. కచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ పట్టుబట్టారు. దీనిపై బుట్టబొమ్మ కూడా సైలెంట్‌గా ఉంది. ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటుంది. ఈ క్రమంలోనే సమంత కూడా ఈ ఇష్యూను చాలా లైట్ తీసుకుంది. తెలివితో డీల్ చేస్తుంది. తనను విమర్శించే వాళ్లకు అదిరిపోయే సమాధానం చెప్పింది స్యామ్.

సమంత వర్సెస్ పూజా హెగ్డే (pooja hegde samantha)
సమంత వర్సెస్ పూజా హెగ్డే (pooja hegde samantha)


చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో అదిరిపోయే పోస్ట్ పెట్టింది సమంత. ఇది చూసిన తర్వాత పూజా హెగ్డేతో పాటు సమంతను విమర్శించే వాళ్లందరి బుర్రలు కూడా గిర్రున తిరగడం ఖాయం. ఎందుకంటే అలా ఇచ్చింది మసంత. తనను ద్వేషించే వాళ్లను చూస్తుంటే తనలో ఇంకా కసి పెరుగుతుందని చెప్పుకొచ్చింది సమంత. అదే పొగిడితే మాత్రం తనలో బద్ధకస్థురాలిగా మారిపోతానని చెబుతుంది సమంత. అందుకే విమర్శించే వాళ్లే తనకు మేలు చేస్తారని ట్వీట్ చేసింది సమంత.

అందుకే హేటర్స్ తనలో కసిని మరింత పెంచేస్తారని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ సమాధానం చూసిన తర్వాత తిట్టడం కొట్టడం కూడా వృథానేమో..? నన్ను రాయితో కొడితే దాంతోనే ఇల్లు కట్టుకుంటా.. నిప్పుతో కాల్చాలనుకుంటే దాంతోనే ఇంటి దీపం పెట్టుకుంటానని అప్పట్లో శ్రీను వైట్లపై ప్రకాశ్ రాజ్ చెప్పిన కవితలా ఇప్పుడు విమర్శకులకు తనదైన శైలిలో సమాధానమిచ్చింది సమంత అక్కినేని.
First published: May 29, 2020, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading