సమంత కొత్త బిజినెస్.. అక్కినేని వారి కోడలు అనిపించుకుందిగా..

పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది సమంత అక్కినేని. అక్కినేని కోడలు అయిన తర్వాత ఎంచుకునే కథల్లో కొత్తదనం చూపిస్తుంది.తాజాగా సమంత కొత్త బిజినెస్‌లో ఎంటరైంది. దానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 19, 2020, 12:33 PM IST
సమంత కొత్త బిజినెస్.. అక్కినేని వారి కోడలు అనిపించుకుందిగా..
సమంత అక్కినేని (Instagram/samantharuthprabhuoffl)
  • Share this:
పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది సమంత అక్కినేని. అక్కినేని కోడలు అయిన తర్వాత ఎంచుకునే కథల్లో కొత్తదనం చూపిస్తుంది. హూందా ఉన్న పాత్రల్లోనే కనిపిస్తుంది సమంత అక్కినేని. తాజాగా 96 రీమేక్‌ ‘జాను’ పలకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం రాలేదు. ప్రస్తుతం సమంత.. తెలుగు దర్శక ద్వయం రాజ్ డికే తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ఫ్యామిలీ మేన్ 2‌లో నటించింది సమంత. ఇప్పటికే సమంత అక్కినేని పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది. వీటితో పాటు తన ఇమేజ్‌కు తగ్గ కథల కోసం వెతుకుతోంది. తాజాగా తాజాగా కొత్త బిజినెస్ ఉమెన్ అయిపోవాలని ప్లానింగ్ సిద్ధం చేసుకుంటుంది అక్కినేని కోడలు. దీనికోసం స్కూలింగ్ బిజినెస్ ఎంచుకుంది స్యామ్. ప్రస్తుతం ఎడ్యుకేషనల్ బిజినెస్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సమంత అక్కినేని (Twitter/photo)


ఇప్పటికే మోహన్ బాబుతో పాటు మరికొందరు కూడా ఈ బిజినెస్‌లోనే ఉన్నారు. ఇప్పుడు సమంత కూడా ఇదే చేస్తోంది.  ఇందులో భాగంగానే ప్రీ స్కూల్, నర్సరీ, ప్రైమరీ స్కూల్, పీపీ-2 స్కూళ్లను ఓపెన్ చేయబోతుంది. దానికి సంబంధించిన విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంది సమంత. తన స్నేహితురాలు.. శిల్పారెడ్డితో పాటు ప్రముఖ విద్యావేత్త ముక్తా ఖురానాతో కలసి ఏకం అనే పేరుతో లెర్నింగ్ సెంటర్‌ను జూబ్లీ హిల్స్‌లో ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. ఈ స్కూల్‌లో పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారట. దాదాపు సంవత్సరం నుంచి ఈ స్కూల్‌కు సంబంధించిన పనులు నడుస్తున్నాయి.



హైదరాబాద్‌లోనే ది బెస్ట్ స్కూల్స్‌గా దీన్ని మార్చాలని చూస్తుంది సమంత. దీనికోసం చైతూతో పాటు నాగార్జున సాయం కూడా తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే బిజినెస్‌లో నాగార్జునను మించిన వాళ్లు టాలీవుడ్‌లో మరొకరు లేరు. ఇక ఇండస్ట్రీలో మంచు విష్ణు లాంటి వాళ్లు ఇప్పటికే అమెరికన్ ప్రీ ఎలిమెంటరీ స్కూల్స్ ప్రాంచైజీలను సొంతంగా నెలకొల్పాడు. అలాంటి వాళ్ల సాయం కూడా తీసుకోవాలని చూస్తుంది సమంత. జీవితా రాజశేఖర్‌తో పాటు సీనియర్ నటి రాశి కూడా స్కూల్ బిజినెస్ చేస్తున్నారు. మరి విద్య వ్యాపారంగా మారుతున్న సమయంలో సమంత వచ్చి ఏం చేస్తుందనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 19, 2020, 12:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading