సమంత.. 'ఏమాయ చేశావే' సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. అంతేకాదు తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది సమంత. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా రాణిస్తున్నారు. అది అలా ఉంటే.. సమంత అక్కినేని సోమవారం ఉదయం ఆంధ్రా ఆసుపత్రి హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్‌ను సందర్శించారు. సమంత అక్కడ తన స్వచ్ఛంద సేవా సంస్థ ‘ప్రత్యూష సపోర్ట్’, ఆంధ్రా ఆసుపత్రితో కలిసి గత 5 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యూష సపోర్టు ద్వారా గుండె జబ్బులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. వీటితో పాటు ప్రాణాపాయ వ్యాధులకు కూడా ప్రత్యూష సపోర్టు ద్వారా వైద్యం అందిస్తున్నారు. కాగ ఈ సందర్భంగా హీరోయిన్ సమంత ఆంధ్రా ఆసుపత్రికి వచ్చి తాను నిర్వహిస్తున్న ప్రత్యూష సపోర్ట్ సహకారంతో వైద్యం చేయించుకున్న పిల్లలతో గడిపారు. అంతేకాదు అక్కడి డాక్టర్లతో మాట్లాడి, పిల్లల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సమంత మాట్లాడుతూ.. ఇంత మంది పిల్లలను ఒకేసారి కలవటం, అందరూ ఆరోగ్యంగా ఉండటం చూసి ఆనందంగా ఉందని తెలిపారు. అయితే దీనికి సంబందించిన కొన్ని పిక్స్ సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్స్ స్పందిస్తూ.. సమంత నువ్వు సూపర్.. నీ హృదయం చాలా గొప్పది.. అంటూ ప్రశంసలతో ముంచేత్తున్నారు.
సమంత ప్రస్తుతం అమెజాన్ వెబ్ సీరిస్ చేస్తోంది. దానికి తోడు 96 తమిళ సినిమాను జాను పేరుతో రీమేక్ చేస్తున్నారు. అందులో సమంత టైటిల్ రోల్ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.