HOME »NEWS »MOVIE »samantha akkineni spending her lot of time in gym only at quarantine period pk

సమంత అక్కినేనికి లాక్‌డౌన్‌లో ఫుల్ టైమ్ పాస్ అక్కడే..

సమంత అక్కినేనికి లాక్‌డౌన్‌లో ఫుల్ టైమ్ పాస్ అక్కడే..
సమంత అక్కినేని (Samantha Akkineni)

Samantha Akkineni: సమంత అక్కినేని.. పరిచయం అక్కర్లేని పేరు. పెళ్లి తర్వాత కూడా అదే రేంజ్ స్టార్ ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ ఈమె. సౌత్ హీరోయిన్లకు పెళ్లి అయితే కెరీర్ క్లోజ్..

  • Share this:
సమంత అక్కినేని.. పరిచయం అక్కర్లేని పేరు. పెళ్లి తర్వాత కూడా అదే రేంజ్ స్టార్ ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ ఈమె. సౌత్ హీరోయిన్లకు పెళ్లి అయితే కెరీర్ క్లోజ్ అయినట్లే అనే ఆనవాయితీకి బ్రేక్ చెప్పింది సమంత. ఇక ఈ భామ ప్రస్తుతం లాక్ డౌన్ సమయానికి భర్తతో పాటు ఎంజాయ్ చేస్తుంది. దాంతో పాటే తన కుక్కపిల్లతో కూడా ఆడుకుంటుంది. అన్నింటికి మించి లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా జిమ్‌లోనే ఎక్కువగా గడిపేస్తుంది. ఫిట్ నెస్ విషయంలో కూడా ఎక్కడలేని శ్రద్ధ తీసుకుంటుంది. పెళ్లి తర్వాత కూడా అదే రేంజ్‌లో ఫిగర్ మెయింటేన్ చేయడం అంటే మాటలు కాదు. సమంత కూడా ఇదే చేస్తుంది.

సమంత అక్కినేని జిమ్ వర్కవుట్ ఫోటో (samantha akkineni)
సమంత అక్కినేని జిమ్ వర్కవుట్ ఫోటో (samantha akkineni)




ముఖ్యంగా కెరీర్‌లో అవకాశాలు రావాలంటే ఫిట్ నెస్ చాలా ముఖ్యం. సమంత ఈ విషయంలో అందరి కంటే మూడు ఆకులు ఎక్కువే చదివింది. ఇప్పటికీ స్టార్ ఇమేజ్ ఉంది కదా.. ఖాళీగా ఉన్నా కూడా ఛాన్సులు వస్తాయి.. ఇంత కష్టం ఎందుకు బాబోయ్ అని అంతా అంటున్నా కూడా తను మాత్రం వర్కవుట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే జిమ్‌లో చెమటలు కక్కుతూనే ఉంటుంది స్యామ్. మొన్నామధ్య ఒకటి రెండు కాదు ఏకంగా 110 కేజీల బరువులు ఎత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మూడు పదుల వయసు వచ్చినా కూడా ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తుంది సమంత.

సమంత అక్కినేని ఫోటో (samantha akkineni)
సమంత అక్కినేని ఫోటో (samantha akkineni)


కష్టమైన వర్కౌట్స్ కూడా చాలా సింపుల్‌గా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. కొన్నాళ్ల కింద 100 కేజీలు లిఫ్ట్ చేసి ఔరా అనిపించిన సమంత.. ఇప్పుడు మరోసారి అదే ఫీట్ చేసి చూపించింది. ఇప్పుడు సమంత ఎత్తిన 100 కేజీల లోడ్ చూసి బాపురే అంటున్నారు ఫ్యాన్స్. ఫిజికల్ ఫిట్ నెస్‌పై సమంతకు ఉన్న శ్రద్దను చూసి ముచ్చటేస్తుంది అంటున్నారు నెటిజన్స్. జాను తర్వాత ఇంకా సినిమాలేవీ కమిటవ్వలేదు సమంత. తమిళనాట విజయ్ సేతుపతి సినిమాలో కమిటైనా కూడా ఇప్పుడు తప్పుకుందని తెలుస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:April 29, 2020, 18:04 IST

टॉप स्टोरीज