HOME »NEWS »MOVIE »samantha akkineni shocking decision over corona lockdown period ta

Samantha: లాక్‌డౌన్‌లో సమంత సంచలన నిర్ణయం.. షాక్‌లో ఫ్యాన్స్..

Samantha: లాక్‌డౌన్‌లో సమంత సంచలన నిర్ణయం.. షాక్‌లో ఫ్యాన్స్..
సమంత అక్కినేని (Instagram/samantharuthprabhuoffl)

Samantha Akkineni | సమంత అక్కినేని లాక్‌డౌన్ పీరియడ్‌లో తీసుకున్న సంచలన నిర్ణయంతో ఆమె అబిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకీ మ్యాటరేమిటంటే..

  • Share this:
    సమంత అక్కినేని లాక్‌డౌన్ పీరియడ్‌లో తీసుకున్న సంచలన నిర్ణయంతో ఆమె అబిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకీ మ్యాటరేమిటంటే.. హీరోయిన్‌గా సమంత యాక్టింగ్ గురించి ఎవరు కొత్త చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని ఇంటి కోడలైన తర్వాత ఈమె కెరీర్ మూడు హిట్లు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఇంకోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసే విధానం చూసి మిగతా ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా లాక్‌డౌన్‌లో హీరో, హీరోయిన్లు ఏదో ఒక పని నేర్చుకుంటున్నారు. తాజాగా  సమంత కూడా లాక్‌డౌన్ పీరియడ్‌లో ఆమె కూడా ఓ పనిచేస్తోంది. అది చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకీ విచిత్రమేమిటంటే.. లాక్‌డౌన్ పీరియడ్‌లో సమంత.. నటనలో కొత్త పాఠాలు నేర్చుకోవడంపై తన దృష్టిని కేంద్రీకరించింది. అంతేకాదు ఆన్‌లైన్‌ తరగతుల్లో సమంత ఈ  పాఠాలు నేర్చుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. ఇకపై మరింత మంచి నటిని కాబోతున్నాను వేచి చూడండి. మంచి నటి అనిపించుకోకపోతే.. ఈ పోస్ట్‌ను తొలిగిస్తానని సమంత చెప్పడం విశేషం.


    ఇది చూసి సమంత అభిమానులు.. నటిగా సామ్ కొత్తగా నేర్చుకోవాల్సిన పని ఏమిటి ? ఇప్పటికే టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా ఎపుడో ప్రూవ్ చేసుకుంది. ఇపుడు కొత్తగా ఈ నటనలో శిక్షణ ఏమిటంటూ కామెంట్స్ చేస్తున్నారు. నీటిలో ఉన్న చేపపిల్లకు ఈత నేర్పించినట్టు ఉంది. ఇపుడు సమంత చేస్తున్న పని అంటూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఏమైనా నటన అనేది అనంతం. అందులో ఎంత నేర్చుకున్నా.. నేర్చుకోవడానికి ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఇపుడు సమంత కూడా అదే పని చేస్తుందంటూ ఇంకొందరు ఆమె చేస్తున్న పనిని మెచ్చుకుంటున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:May 07, 2020, 09:02 IST

    टॉप स्टोरीज