Chinthakindhi.RamuChinthakindhi.Ramu
|
news18-telugu
Updated: April 15, 2019, 12:16 AM IST
ఆ విషయంలో ఇండస్ట్రీలో రామ్‌చరణ్ ఒక్కడే... అక్కినేని సమంత షాకింగ్ కామెంట్స్...
సమంత అక్కినేని ప్రస్తుతం ‘మజిలీ’ మూవీ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. తనకు హిట్ వచ్చిందనే ఆనందం కంటే... వరుస ఫ్లాపులతో సతమతమైన భర్త అక్కినేని నాగచైతన్యకు భారీ బ్లాక్‌బస్టర్ ఇచ్చాననే సంతృప్తిలో మునిగితేలుతోంది సమంత. గత వారం విడుదలైన ‘మజిలీ’ మూవీ వారం రోజుల్లోనే రూ.28 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి, భారీ విజయం సాధించింది. ఇప్పటికే అన్ని చోట్ల లాభాల బాట పట్టింది ‘మజిలీ’ మూవీ. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో తెగ బిజీగా గడుపుతోన్న సమంత అక్కినేని... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి, ఆయన సతీమణి ఉపాసన కామినేని గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘రామ్ చరణ్, ఉప్పీ (ఉపాసన) కలిసి టాలీవుడ్‌ను ఒక్కటి చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అందరిలోనూ స్నేహభావాన్ని పెంచుతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు...’ అంటూ వ్యాఖ్యానించింది సమంత అక్కినేని. ఉపాసన చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న ‘బి పాజిటివ్- హెల్డ్ అండ్ లైఫ్‌స్టైల్’ అనే హెల్త్ మ్యాగజైన్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది సమంత. ఈ సందర్భంగా చెర్రీ గురించి, ఆయన సతీమణి ఉపాసన గురించి పై వ్యాఖ్యలు చేసింది.

‘యుద్ధం శరణం’, ‘సవ్యసాచి’, ‘శైలాజా రెడ్డి అల్లుడు’ సినిమాల ఫ్లాప్ తర్వాత ‘మజిలీ’తో మంచి హిట్ దక్కించుకున్నాడు అక్కినేని నాగచైతన్య.
‘ఇండస్ట్రీలో ఎవ్వరూ సక్సెస్ సాధించిన అభినందించే వ్యక్తి... బహుశా ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఒక్కడేనేమో’ అంటూ ‘రంగస్థలం’ కోస్టార్‌ను పొగిడేసిన సమంత అక్కినేని... మరో ఆర్టిస్ట్ నటనకు మెచ్చి, పుష్పగుచ్ఛం పంపించే సూపర్‌స్టార్ ఎవ్వరూ లేరు...’ అని తేల్చిచెప్పేసింది. ‘మజిలీ’ సినిమా చూసిన రామ్ చరణ్, ఉపాసన జంట... సమంత అక్కినేని, నాగచైతన్యలను అభినందిస్తూ వారి ఇంటికి ఫ్లవర్ బొకే పంపించారట. ఇంతుకుముందు ‘శ్రీమంతుడు’ సమయంలో మహేశ్ బాబుకీ, ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా టైమ్‌లో ఎన్టీఆర్‌కు ఇలాగే ఫ్లవర్ బొకేలు పంపి, అభినందనలు తెలిపాడు రామ్ చరణ్. ఈ విషయం తెలిసిన సమంత అక్కినేని... పైవిధంగా వ్యాఖ్యలు చేసింది.

సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ ఉండే సమంత అక్కినేని... ‘మజిలీ’మూవీని అభినందిస్తూ పోస్ట్ పెట్టినవారందరికీ రిప్లై ఇస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.
పెళ్లికి ముందు కొన్ని సంఘటనలతో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన రామ్ చరణ్, పెళ్లైన తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఎంతో సౌమ్యంగా మెలుగుతూ, అందర్నీ కలుపుకుపోతున్నాడు. రామ్ చరణ్‌లో వచ్చిన మార్పులో ఆయన సతీమణి ఉపాసన పాత్ర చాలా ఉందనేది ఎవ్వరూ కాదనలేని నిజం. ‘రంగస్థలం’ సినిమాతో మంచి నటుడిగా నిరూపించుకున్న రామ్ చరణ్, ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అయ్యిందని స్వయంగా ఒప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సమంత అక్కినేని కామెంట్స్‌తో చెర్రీ ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలో అన్ని హీరోల ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కారణం రామ్ చరణ్, అటు సూపర్ స్టార్ మహేష్ బాబుకీ, ఇటు యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్కు క్లోజ్ ఫ్రెండ్ కావడం. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో 'RRR' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
First published:
April 14, 2019, 11:59 PM IST