హీరో సిద్ధార్థ్ పై సమంత షాకింగ్ కామెంట్స్.. నా బ్రతుకు సావిత్రిలా తయారయ్యేది అంటూ..
హీరో సిద్ధార్థ్ పై సమంత షాకింగ్ కామెంట్స్.. నా బ్రతుకు సావిత్రిలా తయారయ్యేది అంటూ..
సిద్ధార్థ్ తో బ్రేకప్ పై సమంత సంచలనం..(Twitter/Photo)
సమంత అక్కినేని ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అక్కినేని ఇంటి కోడలైన తర్వాత ఈమె కెరీర్ మూడు హిట్లు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది. తాజాగా ఆమె హీరో సిద్ధార్ధ్‌తో బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించి సంచలనం సృష్టించింది.
సమంత అక్కినేని ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అక్కినేని ఇంటి కోడలైన తర్వాత ఈమె కెరీర్ మూడు హిట్లు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఇంకోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసే విధానం చూసి మిగతా ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఈ భామ ఒక ఇంగ్లీష్ పత్రిక నిర్వహించే పోల్‌లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ అవార్డులపై కొన్ని విమర్శలు వచ్చినా.. నిజంగానే సమంత మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అనే చెప్పాలి. ఐతే.. సమంతకు అక్కినేని నట వారసుడు నాగ చైతన్యతో పెళ్లి కాకముందు... సిద్ధార్ధ్ లో లవ్ ఎఫైర్ నడిపిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో సిద్ధార్ధ్‌తో లవ్ ఎఫైర్, డేటింగ్, బ్రేకప్ తదితర విషయాలను చెప్పి సంచలనం సృష్టించింది సమంత.
అప్పట్లో శ్రీకాళహస్తిలో కాల సర్ప దోష పూజలు సిద్ధార్ధ్‌తో కలిసి చేసిన సమంత అక్కినేని (Twitter/Photo)
సమంత.. తన భర్త నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఏమాయ చేసావే’ సినిమాతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత సమంత, చైతూతో మంచి స్నేహితురాలిగానే మెలిగింది. ఆ తర్వాత సమంత.. హీరో సిద్ధార్ధ్‌తో చాలా ఏళ్లు డేటింగ్ చేసింది. వీళ్లిద్దరు కలిసి ‘జబర్ధస్త్’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత వీళ్లు తమ జాతకాల్లోని నవ గ్రహ దోషాలను తొలిగించుకోవడానికి శ్రీకాళహస్తికి వెళ్లి రాహు, కేతువులకు సంబంధించి కాల సర్ప దోష పూజలు చేసారు. అప్పట్లో వీళ్లిద్దరు కలిసి శ్రీకాళహస్తికి వెళ్లడం పెద్ద మ్యాటరైంది. ఆ తర్వాత ఏమైందో ఏమో సమంత, సిద్ధార్ధ్‌కు బ్రేకప్ చెప్పి తన తోటి నటుడు నాగ చైతన్యను పెద్దలను ఒప్పించి 2017 అక్టోబర్‌లో పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరి పెళ్లి హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరిగింది.
నాగ చైతన్య, సమంత (Instagram/Photo)
నాగ చైతన్యతో జీవితం సాఫీగా సాగిపోతున్న ఈ తరుణంలో తన మాజీ ప్రియుడు సిద్ధార్ధ్ గురించి ఒక పత్రికలో ప్రస్తావించడం చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. సావిత్రి జీవితంలో ఏ విధమైన కష్టాలు సంభవించాయో నా జీవితంలో కూడా అలాంటివే చోటు చేసుకున్నాయంది. ముందుగానే నేను అలాంటివి పసిగట్టడంతో పరిస్థితి చేయి దాటకముందే జాగ్రత్త పడ్డానంది. కాబట్టే నా జీవితం ఇపుడు సాఫీగా సాగిపోతుందంటూ చెప్పుకొచ్చింది. సిద్ధార్ధ్‌తో వ్యవహారాన్ని ఏమాత్రం నాన్చకూడదనే నిర్ణయానికి అప్పట్లో రావడం నేను జీవితంలో తీసుకున్న అతి పెద్ద ముఖ్య నిర్ణయాల్లో ఒకటి అని ప్రస్తావించింది. ఇక తన భర్త నాగ చైతన్య గురించి మాట్లాడుతూ.. చైతన్య నాకు భగవంతుడు ఇచ్చిన కానుక. అందరికీ తన చైతూల అర్ధం చేసుకునే భర్త దొరకాలని ఈ సందర్భంగా ప్రస్తావించింది.
నాగ చైతన్య, సమంతల ‘ఏమాయ చేసావే’ (Twitter/Photo)
ఇక చైతూ లాంటి మరో వ్యక్తిని చూడలేం అని సమంత చెప్పారు. ఈ యేడాది సమంత నటించిన ‘జాను’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. మరోవైపు ఈమె మరో తమిళ క్రేజీ చిత్రంలో నటిస్తోంది. ఇంకోవైపు సమంత ముఖ్యపాత్రలో నటించిన ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌లో త్వరలో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్షం కానుంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.