Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: January 9, 2020, 5:20 PM IST
శర్వానంద్, సమంత ‘జాను’ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)
సమంత అక్కినేని, శర్వానంద్ జంటగా నటిస్తున్న సినిమా జాను. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. తమిళనాట సంచలన విజయం సాధించిన 96 సినిమాకు ఇది రీమేక్. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించారు. అక్కడ ఈ చిత్రం క్లాసిక్గా నిలిచింది. ఇదే సినిమాను జాను పేరుతో రీమేక్ చేస్తున్నాడు ప్రేమ్ కుమార్. నిజానికి 96 విడుదలకు ముందే ఈ చిత్రాన్ని చూసి రీమేక్ రైట్స్ తీసుకున్నాడు దిల్ రాజు. ఇక్కడ శర్వానంద్, సమంతతో రీమేక్ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. మనసును తాకే సన్నివేశాలకు తోడు అందమైన సంగీతం 96 సినిమాకు ప్రత్యేకత.
ఇదే సీన్ తెలుగులో కూడా రిపీట్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకే ఇక్కడ కూడా అదే మ్యాజిక్ ఉండేలా చూసుకుంటున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉంది. ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుంది. తాజాగా విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకుంటుంది. శర్వానంద్, సమంత కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది. నన్నొదలి దూరంగా వెళ్తున్నావా రామ్ అని సమంత అంటే.. నిన్నెక్కడ వదిలేసానో అక్కడే ఉన్నానంటూ శర్వా చెప్పడం.. ఆ వెంటనే సమంత ఏడవడం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి తమిళనాట ఉన్న మ్యాజిక్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందో లేదో చూడాలిక.
Published by:
Praveen Kumar Vadla
First published:
January 9, 2020, 5:20 PM IST