SAMANTHA AKKINENI SHARWANAND JAANU FIRST LOOK RELEASED TA
సమంత, శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘జాను’ ఫస్ట్ లుక్ విడుదల..
సోషల్లో వైరల్ అవుతోన్న సమంత పిక్స్
అక్కినేనిసమంత, శర్వానంద్ జంటగా దిల్ రాజు నిర్మాణంలో ఓ రీమేక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేసారు చిత్ర యూనిట్..
అక్కినేనిసమంత, శర్వానంద్ జంటగా దిల్ రాజు నిర్మాణంలో ఓ రీమేక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా 96 పేరుతో వచ్చిన ఆ సినిమా అక్కడి ప్రేక్షకుల్నీ విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు మంచి వసూళ్లను రాబట్టింది. హృదయాలను తాకే సన్నివేశాలతో.. దానికి తగ్గట్లుగా నేపథ్య సంగీతం కూడా అమరడంతో ఆ సినిమా అక్కడి ప్రేక్షుకుల్నీ తెగ నచ్చేసింది. ఈ సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. తమిళ ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న జాను, పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేసారు.
శర్వానంద్, సమంత *‘జాను’ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)
ఈ లుక్లో శర్వానంద్.. ఎడారిలో ఒంటెలను తాడుతో లాగుతూ కనిపిస్తున్నాడు. ఎటువంటి సరిహద్దులు,షరతులు లేని అసలుసిసలైన నివాళి అంటూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ను విడుదల చేసింది.
శర్వానంద్, సమంత *‘జాను’ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)
ఈ సినిమా విషయానికొస్తే.. స్కూల్ డేస్లో ప్రేమలో పడ్డ హీరో, హీరోయిన్లు ఆ తర్వాత అనుకోని కారణాలతో విడిపోతారు. ఆ తర్వాత చాలా యేళ్ల తర్వాత కలిసిన వీళ్లిద్దరి మధ్య జరిగిన చిలిపి సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.