• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAMANTHA AKKINENI SHARES VIDEO OF A FIERCE KID DOING KARATE MNJ

Naga Chaitanya Samantha: నిజమే చైతన్య-సమంతకు కూతురు పుడితే ఇలానే ఉంటుందేమో..!

Naga Chaitanya Samantha: నిజమే చైతన్య-సమంతకు కూతురు పుడితే ఇలానే ఉంటుందేమో..!

సమంత నాగ చైతన్య (samantha naga chaitanya)

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ చైత‌న్య(Naga Chaitanya), స‌మంత అక్కినేని(Samantha Akkineni)కి కూతురు పుడుతుందా..? కొడుకు పుడ‌తాడా..? ఈ చ‌ర్చ‌లు ఎప్ప‌టి నుంచో అభిమానుల మ‌ధ్య జ‌రుగుతూనే ఉన్నాయి. వాటికి తోడు స‌మంత గ‌ర్భ‌వ‌తి అంటూ ఎన్నోసార్లు పుకార్లు వ‌చ్చాయి.

  • Share this:
    Naga Chaitanya- Samantha: టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ చైత‌న్య, స‌మంత అక్కినేనికి కూతురు పుడుతుందా..? కొడుకు పుడ‌తాడా..? ఈ చ‌ర్చ‌లు ఎప్ప‌టి నుంచో అభిమానుల మ‌ధ్య జ‌రుగుతూనే ఉన్నాయి. వాటికి తోడు స‌మంత గ‌ర్భ‌వ‌తి అంటూ ఎన్నోసార్లు పుకార్లు వ‌చ్చాయి. దీనిపై ఓ ఇంట‌ర్వ్యూలో ఫ‌న్నీగా కూడా స్పందించింది అక్కినేని కోడ‌లు. 2017 నుంచి నేను గ‌ర్భ‌వ‌తి అవుతూనే ఉన్నాన‌ని స‌మంత వెల్ల‌డించింది. ఇదిలా ఉంటే స‌మంత‌కు కూతురు పుడితే ఇలానే ఉంటుందేమో అన్న‌ట్లుగా ఓ వీడియో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దాన్ని స‌మంత‌నే త‌న ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయ‌డంతో.. అది మ‌రింత వైర‌ల్‌గా మారింది.

    కాగా ఆ వీడియోలో ఓ బుడ్డ‌ది.. కరాటే చేస్తూ ఉంది. దానికి నా భవిష్యత్ కూతురు అన్న టైటిల్ ఉంది. అయితే ఒరిజ‌న‌ల్‌గా స్కేరీ మ‌మ్మీ అనే అకౌంట్‌లో ఈ వీడియో ఉండ‌గా.. దాన్ని స‌మంత రీపోస్ట్ చేశారు. ఇక దాన్ని చూసిన ఫ్యాన్స్ కూడా నిజ‌మే.. స‌మంత‌కు కూతురు పుడితే ఇలానే ఉంటుందేమో అని కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఫిట్‌నెస్ మీద స‌మంత‌కు ఆస‌క్తి ఎక్కువ‌. ఫిట్‌నెస్ కోసం జిమ్, యోగాల‌ను నేర్చుకున్న స‌మంత‌.. ఇప్పుడు అనిమ‌ల్ ప్లో అనే కొత్త వ‌ర్కౌట్లను కూడా స్టార్ట్ చేసింది. ఇక ఆమెకే ఫిట్‌నెస్ మీద అంత ఆస‌క్తి ఉందంటే.. స‌మంత కూతురు క‌రాటే నేర్చుకోవ‌డం ఆశ్చ‌ర్య‌పోవాల్సిన విష‌యం కాద‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


    కాగా గ‌త ఏడాది ఒక్క సినిమాతో ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చింది స‌మంత‌. ప్ర‌స్తుతం స‌మంత తెలుగులో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంత‌లం.. త‌మిళ్‌లో విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కాటువాకుల రెండ‌డు కాద‌ల్ మూవీల్లో న‌టిస్తోంది. వీటితో పాటు ఆమె న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ వ‌చ్చే నెల‌లో అమెజాన్‌లో విడుద‌ల కానుంది.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు