హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Akkineni : రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న సమంత కొడుకు.. యష్ అక్కినేని..

Samantha Akkineni : రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న సమంత కొడుకు.. యష్ అక్కినేని..

11. నాగార్జున షూటింగ్ వెళ్లడంతో సమంత గెస్ట్ హోస్ట్‌గా రావడం..

11. నాగార్జున షూటింగ్ వెళ్లడంతో సమంత గెస్ట్ హోస్ట్‌గా రావడం..

Samantha Akkineni : సమంత తెలుగులో టాప్ హీరోయిన్‌లలో ఒకరుగా ఉన్న ఈ భామ ప్రస్తుతం సినిమాలకు కొంత విరామం ఇచ్చింది.

  Samantha Akkineni : సమంత తెలుగులో టాప్ హీరోయిన్‌లలో ఒకరుగా ఉన్న ఈ భామ ప్రస్తుతం సినిమాలకు కొంత విరామం ఇచ్చింది. దీనికి కారణం ఇంత వరకు తెలియదు. అంటే ఆమె ప్రస్తుతం ఎలాంటీ సినిమా షూటింగ్‌లో పాల్గొనట్లేదు. ఇక అది అలా ఉంటే సమంత ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో ఓ టాక్ షోను నిర్వహిస్తోంది. సామ్ జామ్ పేరుతో వస్తోన్న ఈ షోలో సినీ సెలెబ్రీటీస్’ను ఇంటర్వూ చేస్తోంది. ఇక సమంత సినీ కెరీర్‌ గురించి మాట్లాడితే.. 'ఏమాయ చేశావే' సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం సమంత తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరు. దీనికి తోడు ఇటీవల ఈ భామ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. తన భర్త నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కలిసి నటించిన ‘మజిలీ’ సినిమా  ఈ యేడాది మొదట్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. ఆ తర్వాత సమంత ఓ కొరియన్ రీమేక్‌లో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. ఆమె ఇటీవల శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.


  ఆ సినిమా తర్వాత సమంత ఏ తెలుగు సినిమాలోను కనిపించలేదు. ఇక సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అది అలా ఉంటే సమంత తన కొడుకు యష్ అక్కినేని రెండవ పుట్టినరోజున ఓ క్యూట్ ఫోటోను పంచుకుంది. యష్ అంటే సమంత పెంచుకునే కుక్క పిల్ల. ఇక యష్ అల్లరిని తెగ ఎంజాయ్ చేస్తోన్న.. సమంత వాటికి సంబందించిన కొన్ని ఫోటోస్‌ను పంచుకుంది. వాడికి స్నానాలు చేయించడం, యష్‌తో ఆడుకోవడం అంతేకాదు వాడి అల్లరిని కెమెరాలో బందించి ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం చేస్తోంది. ఆ కుక్క పిల్ల కూడా సూపర్ క్యూట్ ఉండి నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక అది అలా ఉంటే సమంత ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన భర్త నాగ చైతన్య 34పుట్టినరోజు సందర్భంగా ఈ జంట ప్రస్తుతం మాల్దీవ్స్‌లో సెలెబ్రేట్ చేసుకునేందుకు అక్కడికి వెళ్లింది. అందులో భాగంగా సమంత తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది. భార్య భర్తలు మాల్దీవుల్లోని ఉత్తరాదిన ఉన్న ఓ ద్వీపంలో ఉన్నట్టు తెలుస్తోంది. సమంత అక్కడ స్కూబా డైవింగ్‌ కూడా చేశారు. దానికి సంబంధించిన ఓ ఫోటోను సమంత పోస్ట్ చేసింది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Samantha akkineni

  ఉత్తమ కథలు