హోమ్ /వార్తలు /సినిమా /

Samantha: సమంత అక్కినేని ఎమోషనల్ పోస్ట్.. ‘ఓ బేబి’ రెండేళ్ల సందర్భంగా సామ్ భావోద్వేగం..

Samantha: సమంత అక్కినేని ఎమోషనల్ పోస్ట్.. ‘ఓ బేబి’ రెండేళ్ల సందర్భంగా సామ్ భావోద్వేగం..

సమంత అక్కినేని (Instagram/Photo)

సమంత అక్కినేని (Instagram/Photo)

Samantha Akkineni: సమంత అక్కినేని (Samatha Akkineni) ఎమోషనల్ పోస్ట్.. ‘ఓ బేబి’ రెండేళ్ల సందర్భంగా సామ్ భావోద్వేగంగా ో పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే..

  Samantha Akkineni: సమంత అక్కినేని (Samatha Akkineni) ఎమోషనల్ పోస్ట్.. ‘ఓ బేబి’ రెండేళ్ల సందర్భంగా సామ్ భావోద్వేగంగా ో పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్‌లో ఏమాయ చేసావే సినిమాతో అడుగుపెట్టి.. ఆ తర్వాత తన తొలి సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లి చేసుకొని.. సినీ ఇండస్ట్రీకి చెందిన అక్కినేని ఫ్యామిలీ కోడలైంది. పెళ్లి తర్వాత సమంత మూడు సినిమాలు.. ఆరు ఆఫర్లు అన్నట్టుగా సాగిపోతుంది. అక్కినేని  హీరోలు హిట్ కోసం ముఖం వాచిపోతుంటే.. సమంత మాత్రం వరుస హిట్స్‌తో దూసుకుపోతుంది. హీరోయిన్‌గా 11 యేళ్లుగా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్‌తో ప్యాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించింది. ఇందులో రాజీ పాత్రలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది.

  ఇక పెళ్లి తర్వాత ఎంపిక చేసిన కొన్ని చిత్రాలు మాత్రమే చేస్తోంది. అందులో భాగంగా రెండేళ్ల క్రితం సమంత అక్కినేని.. నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబి’ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో ముసలి బామ్మ ఎలా పడుచు యువతిగా మారితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సమంత ఎమోషనల్ పోస్ట్ చేస్తూ ఆ సినిమాకు సంబంధించి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది.


  ఈ సందర్భంగా కాస్తంత ఎమోషనల్ అయింది. కెరీర్‌లో తాను ఎన్ని సినిమాలు చేసినా.. ‘ఓ బేబి’లో నేను నిజంగా చిన్న పిల్లలా మారిపోయాను. సమంత విషయానికొస్తే.. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు  వెబ్  సిరీస్‌‌లు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ‘ఆహా’ ఓటీటీలో సమంత అక్కినేని ఇంటర్వ్యూలు చేసి నిజంగానే ఆహా అనిపించిన సంగతి తెలిసిందే కదా. సమంత ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఆమె తమిళంలో ‘కాతు వాకుల’ ‘రెండు కాదల్’ అనే సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో  పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’లో కూడా నటిస్తోంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Nandini Reddy, Oh Baby, Samantha akkineni, Shakunthalam movie, Tollywood

  ఉత్తమ కథలు