హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Akkineni: సమంత అక్కినేని బోల్డ్ వీడియో షూట్.. వావ్ అనాల్సిందేగా..

Samantha Akkineni: సమంత అక్కినేని బోల్డ్ వీడియో షూట్.. వావ్ అనాల్సిందేగా..

సమంత Photo : Instagram

సమంత Photo : Instagram

Samantha Akkineni : తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది తమిళ పొన్ను సమంత.

    Samantha Akkineni : తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది తమిళ పొన్ను సమంత. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. ఇక ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగా ఉంటోన్న సమంత ఆహా ఓటీటీలో ఓ టాక్ షో చేస్తోంది. అది అలా ఉంటే సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో సమంత ఎంతో ఇష్టపడి కుట్టించుకున్న డ్రెస్సుల్నీ చూపిస్తూ.. ఇవన్ని నేను చాలా ఇష్టపడి కుట్టించుకున్నాను. అయితే అలాంటీ సందర్భం రాలేదు. వాటినీ వేసుకోలేదు అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సమంత వివిధ సందర్భాల్లో ధరించాలనుకున్న దుస్తుల్నీ ధరించి కేక పెట్టించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇటీవల తన క్లాతింగ్ బ్రాండ్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. సాకి పేరుతో మొదలైన ఈ క్లాతింగ్ బ్రాండ్‌కు సమంతనే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ తనవంతు కృషి చేస్తోంది. అందులో భాగంగానే లేటెస్ట్ గా సాకి ప్రమోషన్స్ కోసం సమంత సూపర్ స్టైల్ కాస్టూమ్ తో దర్శనమిచ్చింది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. జాను తర్వాత కొత్త సినిమా ఏది ఓకే చెప్పని సమంత లేటెస్ట్ గా ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఓకే చెప్పింది.


    నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ భామ గురించి మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వార్త ఏమంటే.. ఓపక్క సినిమాలలో నటిస్తూ .. మరోపక్క వస్త్ర వ్యాపారంలోకి కూడా దిగిన సమంత తాజాగా మరో భారీ వ్యాపారంలోకి దిగుతోందట. ఓటీటీ సంస్థను నెలకొల్పడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నారనీ, ఇందులో సమంత కీలక పాత్ర పోషించనుందనీ తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడికానున్నాయి. ఇక ఇప్పటికే మరో తెలుగు నిర్మాత అల్లు అరవింద్ ఈ ఓటీటీలోకి ప్రవేశించి విజయవంతం అయ్యిన సంగతి తెలిసిందే. చూడాలి మరి అక్కినేని కుంటుంబం ఏమాత్రం విజయం సాధిస్తుందో.. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే..  ఆమె ఇటీవల శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా తర్వాత సమంత ఏ తెలుగు సినిమాలోను కనిపించలేదు. ఇక సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్‌లో స్ట్రీమ్ కానుంది.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Samantha akkineni

    ఉత్తమ కథలు