Samantha: భర్తతో కలిసి బైకుపై షికారుకు వెళ్లిన సమంత..

సమంత అక్కినేని లాక్‌డౌన్ పీరియడ్‌లో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సమంత తన భర్త అక్కినేని నాగ చైతన్యతో కలిసి బైక్ పై వెళుతున్న ఫోటోను షేర్ చేసింది.

news18-telugu
Updated: May 15, 2020, 7:37 PM IST
Samantha: భర్తతో కలిసి బైకుపై షికారుకు వెళ్లిన సమంత..
సమంత నాగ చైతన్య (samantha naga chaitanya)
  • Share this:
సమంత అక్కినేని లాక్‌డౌన్ పీరియడ్‌లో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటోంది. షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన సమంత.. ఇంట్లో భర్త నాగ చైతన్యతోపాటు..కుక్కతో ఆడుకుంటోంది. దాంతో పాటు ఆన్‌లైన్‌లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటోంది. అంతేకాదు ఫిజికల్ ఫిట్‌నెస్  కోసం ఆన్‌లైన్‌లో తన ట్రైనర్ సందీప్ రాజ్ సూచనలు తీసుకొని ఫిట్‌గా తయారయ్యేపనిలో పడింది. తాజాగా తన భర్తతో కలిసి కారులో షికారుకు వెళుతున్న ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా బైక్ పై తన భర్త నాగ చైతన్యతో షికారుకు వెళుతున్న ఫోటోను షేర్ చేసింది. దీనికి బ్రెడ్ ఎమోజీని క్యాప్షన్‌గా జత చేసింది. సమంత ఇటీవల శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దీనితో పాటు సమంత ఓ రియాలిటీ షోకు జడ్జ్‌గా  చేయనున్నట్టు సమాచారం.

View this post on Instagram

🍞

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on



Published by: Kiran Kumar Thanjavur
First published: May 15, 2020, 7:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading