హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Akkineni: సమంత ఫిట్‌నెస్ వెనుక ఇంత కష్టముందా? ఫోటో వైరల్..

Samantha Akkineni: సమంత ఫిట్‌నెస్ వెనుక ఇంత కష్టముందా? ఫోటో వైరల్..

సమంత Photo : Instagram

సమంత Photo : Instagram

Samantha :తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది తమిళ పొన్ను సమంత.

  Samantha :తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది తమిళ పొన్ను సమంత. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. ఆమె శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అది అలా ఉంటే సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.. అయితే ఈ సారి మాత్రం తన ఫిట్ నెస్‌‌కు సంబందించి ఓ ఫోటోను షేర్ చేసింది. వర్కౌట్స్ చేస్తూ.. అటో పది కేజీలు, ఇటో పది కేజీల బరువును మోస్తూ.. జిమ్ సూట్‌లో అదరగొడుతోంది. దీంతో ఈ పిక్ చూసిన నెటిజన్స్.. వావ్ సమంత అదిరింది అని అంటున్నారు. అంతేకాదు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఫిట్ గా ఉండటానికి ఇంత కష్టపడాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


  ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత ఓ సినిమా చేయాల్సీవుండగా.. ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం. దీంతో సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేయనున్నాడట. ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుందట. ఈ సంస్థ సమంతతో హర్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమాని ప్లాన్‌ చేసింది. ఈ చిత్రానికి తొలుత శరవణ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించాల్సి ఉండగా.. కొన్ని కారణాలు ఆయన ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను నందిని రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందబోయే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపు పూర్తయ్యాయట. ఈ సినిమాతో పాటు సమంత కన్నడ సినిమా దియాను తెలుగులో రీమేక్‌ చేయనుందట. కన్నడ సినిమా దియాను చూసిన సమంత ఆ రీమేక్‌లో నటించాలనీ కోరుకుంటుందట. ఈ సినిమాపై కొంత క్లారిటీ రావాల్సీ వుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Samantha akkineni

  ఉత్తమ కథలు