Samantha Akkineni : సమంత మరోసారి కనులవిందు చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్’గా ఉండే సమంత తన సినిమాల విషయాల గురించి, సమాజంలో జరుగుతున్న విశేషాలను తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటూ... వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. కాగా తాజాగా అక్కినేని కోడలు సమంత తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అదిరిపోయే హాటు ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో సమంత సూపర్ కాస్తా బోల్డుగానే అదరగొట్టింది. దీంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సమంత అందాన్ని పొగుడుతుంటే.. మరికొంత మంది ఇదేంటని విమర్శిస్తున్నారు. పెళ్లి తర్వాత కాస్తా తగ్గాలనీ చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే సమంత ఈ మధ్య కాస్తా అందాల ప్రదర్శనను పెంచిందని తెలుస్తోంది. అయితే దీనికి కారణం లేకపోలేదు. అక్కినేని కోడలు ఇటీవల ఓ క్లాతింగ్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టిన సంగతితెలిసిందే. సాకి పేరుతో వచ్చిన ఈ నయా క్లాతింగ్ బ్రాండ్‌కు సమంతనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. సమంత హాటు ఫోటో షూట్లకు ఈ బ్రాండింగ్ ఓ కారణమని అంటున్నారు ఆమె అభిమానులు.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య సమంత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. సినిమాలకు కొంత దూరంగా ఉంటోన్న సమంత అల్లు అరవింద్ ఆహా ఓటీటీలో ఓ టాక్ షో చేస్తోంది.
అక్కడ సినీ సెలెబ్రీటీలతో మాట్లాడుతూ వారిని ఇంటర్వూ చేస్తూ అలరిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులను ఇంటర్వూ చేసింది అక్కినేని భామ. అందులో ముఖ్యంగా విజయ్ దేవరకొండ, చిరంజీవి, అల్లు అర్జున్, రానా తదితరులున్నారు.
తాజాగా సమంత తన ప్రియుడు భర్త నాగచైతన్యను కూడా ఇంటర్యూ చేసింది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. జాను డిజాస్టర్ తర్వాత కొత్త సినిమా ఏది ఓకే చెప్పని సమంత లేటెస్ట్ గా ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఓకే చెప్పింది. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ఈ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇక ఈ భామ గురించి మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వార్త ఏమంటే.. ఓపక్క సినిమాలలో నటిస్తూ .. మరోపక్క వస్త్ర వ్యాపారంలోకి కూడా దిగిన సమంత తాజాగా మరో భారీ వ్యాపారంలోకి దిగుతోందట. ఓటీటీ సంస్థను నెలకొల్పడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నారనీ, ఇందులో సమంత కీలక పాత్ర పోషించనుందనీ తెలుస్తోంది.
త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడికానున్నాయి. ఇక సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్‌లో స్ట్రీమ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌ను తెలుగు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఒకేసారి తెలుగు తమిళ, హిందీ భాషాల్లో స్ట్రీమ్ కానుంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.