హోమ్ /వార్తలు /సినిమా /

పెళ్లి తర్వాత సమంత సినిమాలు.. తిట్టిన నాగ చైతన్య..

పెళ్లి తర్వాత సమంత సినిమాలు.. తిట్టిన నాగ చైతన్య..

దాంతో ప్రశ్న అడిగిన వాడికి కూడా దిమ్మ తిరిగిపోయింది. మొత్తానికి పిల్లల విషయంలో తమ కుటుంబానికి లేని ఆసక్తి మీకెందుకు అన్నట్లుగా ఇన్‌డైరెక్ట్ సమాధానం ఇచ్చింది సమంత అక్కినేని.

దాంతో ప్రశ్న అడిగిన వాడికి కూడా దిమ్మ తిరిగిపోయింది. మొత్తానికి పిల్లల విషయంలో తమ కుటుంబానికి లేని ఆసక్తి మీకెందుకు అన్నట్లుగా ఇన్‌డైరెక్ట్ సమాధానం ఇచ్చింది సమంత అక్కినేని.

Samantha Naga Chaitanya: తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ట్రెండింగ్ కపుల్ సమంత, నాగ చైతన్య. అలాంటి వాళ్లు ఎందుకు గొడవ పడ్డారు అనుకుంటున్నారా..?

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ట్రెండింగ్ కపుల్ సమంత, నాగ చైతన్య. ఎప్పుడు చూసినా కలిసే కనిపిస్తారు.. ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటారు. అలాంటి వాళ్లు ఎందుకు గొడవ పడ్డారు అనుకుంటున్నారా..? ఏ విషయంలో ఈ ఇద్దరి వార్ జరిగిందో తెలిస్తే పక్కా షాక్ అవుతారు. సినిమాల విషయంలోనే ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నమ్మడానికి ఇది కాస్త కష్టంగానే అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే సమంతే ఈ విషయం చెప్పింది కాబట్టి. పెళ్లి తర్వాత సినిమాలు చేసే విషయంలో తనకు, భర్త చైతూకు గొడవైందని సంచలన విషయాలు బయటపెట్టింది సమంత అక్కినేని.

సమంత అక్కినేని (Instagram/samantharuthprabhuoffl)
సమంత అక్కినేని (Instagram/samantharuthprabhuoffl)

ఈమె చెప్పిన కొన్ని విషయాలు వింటే చైతూ ఎలాంటి వాడనేది కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత కూడా తాను వరస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అనిపించుకోవడం అనేది సంతోషంగా ఉందని చెప్పింది సమంత. పైగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా కూడా నిలిచింది ఈమె. ఈ సందర్భంగానే తన కెరీర్ ముచ్చట్లు కూడా చెప్పుకొచ్చింది స్యామ్. పెళ్లి తర్వాత సినిమాలు మానేద్దామని తాను అనుకున్నానని.. అయితే అప్పుడు నాగ చైతన్య తన నిర్ణయం విని తిట్టేసాడని చెప్పుకొచ్చింది.

నాగ చైతన్య,సమంత (twitter/photo)
నాగ చైతన్య,సమంత (twitter/photo)

చాలా మందికి రాని అవకాశం సినిమాల్లో నటించడం.. ఎంతోమంది ఎదురు చూస్తుంటారు దాని కోసం.. అలాంటి అవకాశం వచ్చినపుడు నీవెందుకు నీకుగా వదిలేసుకుంటావ్.. పిచ్చి కానీ పట్టిందా అంటూ తనపై సీరియస్ అయ్యాడని చెప్పింది సమంత. అవకాశాలు నీ కోసం వచ్చినపుడు వదిలేసుకోవడం మంచి పద్దతి కాదని చై చెప్పిన తర్వాత తను వరస సినిమాలు చేస్తున్నట్లు చెప్పింది ఈమె.

నాగ చైతన్య, సమంత (Instagram/Photo)
నాగ చైతన్య, సమంత (Instagram/Photo)

ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇప్పటికీ సినిమాల్లో తనను చూస్తున్నారని చెప్పుకొచ్చింది అక్కినేని కోడలు. ఇది విన్న తర్వాత చై వ్యక్తిత్వంపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు సమంత కూడా భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో గ్లామర్ రోల్స్ కాకుండా రంగస్థలం, జాను, ఓ బేబీ, మజిలీ, యుటర్న్ లాంటి పర్ఫార్మెన్స్ ఒరియెంటెడ్ పాత్రలు మాత్రమే చేస్తూ వస్తుంది.

First published:

Tags: Naga Chaitanya, Samantha akkineni, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు