Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 26, 2020, 7:50 PM IST
నాగార్జున సమంత నాగ చైతన్య (Samantha Naga Chaitanya)
నాగార్జున స్థానంలో బిగ్ బాస్ హోస్టింగ్‌కు వచ్చిన సమంత అక్కినేని.. తొలి ఎపిసోడ్‌లోనే ఆకట్టుకుంది. మామ చాటు కోడలిగా కాదు మామను మించిన కోడలిగా మారిపోయేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఏకధాటిగా నాలుగు గంటల ఎపిసోడ్ నడిపించింది సమంత. అక్కడ హౌజ్ మేట్స్‌ను కలిసిన విధానం.. వాళ్లతో మాట్లాడిన పద్దతి అవన్నీ చూస్తుంటే సోషల్ మీడియాలో సమంత హోస్టింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. సేవ్ చేసినపుడు కానీ.. ఎలిమినేట్ చేయాల్సి వచ్చినపుడు కానీ సమంత చాలా కూల్‌గా.. సెటిల్డ్‌గా కనిపించింది. తనకు హోస్టింగ్ చేయడం అలవాటు లేదంటూనే చాలా అద్భుతంగా చేసింది సమంత. అక్కినేని కోడలా మజాకా అనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే బిగ్ బాస్ వేదికపై సొంత విషయాలు కూడా పంచుకుంది సమంత. ఏ మాత్రం మొహమాటపడకుండా అన్ని విషయాలను అక్కడ హౌజ్ మేట్స్‌కు చెప్పింది. సందర్భానుసారంగా తన జీవితంలో జరిగిన విషయాలను కూడా అక్కడ చెప్పింది సమంత. ఇంట్లో అరియానాను చూస్తుంటే తనను తాను చూసుకున్నట్లు అనిపిస్తుందని చెప్పి ఆసక్తి పుట్టించింది.

సమంత బిగ్ బాస్ (Samantha Bigg Boss host)
సమంత చెప్పిన మాటలతో అరియానా అయితే గాల్లోనే ఉంది.. ఎంతసేపటికీ కిందకి దిగలేదంటే నమ్మండి. అలా అరియానాకు కూడా మోటివేషన్ ఇచ్చింది. మరోవైపు మోనాల్ విషయంలో కూడా చిన్నసైజ్ క్లాస్ తీసుకుంది సమంత. ఇంట్లో ప్రతీ చిన్న విషయానికి ఏడుస్తూనే ఉంటుంది మోనాల్. అది చాలా మందికి నచ్చదు కూడా.. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. ఆమెను ఏడుపు ఆపాలంటూ నాగార్జున కూడా చాలాసార్లు చెప్పాడు. కానీ వినలేదు.. ఇప్పుడు సమంత కూడా చెప్పింది. కాకపోతే తనదైన స్టైల్లో చెప్పుకొచ్చింది సమంత. చీటికి మాటికి వచ్చే ఏడుపుకు అస్సలు విలువ ఉండదంటూ కాస్త గట్టిగానే చెప్పింది సమంత.

బిగ్ బాస్ 4 మోనాల్ (bigg boss 4 monal)
అలా చేయొద్దని.. ఊరికే ఏడవొద్దని.. అలా చేసినపుడు ఎదుటి వాళ్లకు కోపం వస్తుందని.. అదే ఎందుకు ఏడుస్తున్నామో క్లియర్‌గా మాట్లాడి సమస్యను సాల్వ్ చేసుకుంటే బాగుంటుందని మోనాల్‌కు సమంత సూచించింది. తన ఇంట్లోనూ నాగ చైతన్య కోప్పడతాడని.. తమ మధ్య గొడవలు కూడా అవుతుంటాయని పర్సనల్ విషయాలను చెప్పింది సమంత. ఆ సమయంలో తాను ఏడిస్తే ఇంకా కోప్పడతాడని చెప్పుకొచ్చింది. అదే క్లియర్‌గా విషయం ఏంటో చెబితో అర్థం చేసుకుంటాడని.. గొడవ అక్కడితోనే సమసిపోతుందని చెప్పుకొచ్చింది సమంత. అక్కినేని కోడలు చెప్పిన విధానం చూసి చాలా మంది ఫిదా అయిపోయారు.
Published by:
Praveen Kumar Vadla
First published:
October 26, 2020, 7:50 PM IST