హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Akkineni: సమంత అక్కినేని దినచర్య ఎలా మొదలవుతుందో తెలుసా..?

Samantha Akkineni: సమంత అక్కినేని దినచర్య ఎలా మొదలవుతుందో తెలుసా..?

సమంత అక్కినేని (Instagram/Samantha Akkineni)

సమంత అక్కినేని (Instagram/Samantha Akkineni)

Samantha Akkineni: సమంత అక్కినేని కొన్ని నెలల నుంచి సినిమాలకు దూరంగానే ఉంది. నటనకు దూరంగానే ఉండి కేవలం బిజినెస్‌తో బిజీగా ఉంది అక్కినేని కోడలు. పైగా ఇప్పుడు కొత్త బిజినెస్ మొదలు పెట్టింది కదా..

సమంత అక్కినేని కొన్ని నెలల నుంచి సినిమాలకు దూరంగానే ఉంది. నటనకు దూరంగానే ఉండి కేవలం బిజినెస్‌తో బిజీగా ఉంది అక్కినేని కోడలు. పైగా ఇప్పుడు కొత్త బిజినెస్ మొదలు పెట్టింది కదా.. సాకి పేరుతో క్లోత్ షోరూం మొదలు పెట్టి అక్కడ బిజీ అయిపోయింది సమంత అక్కినేని. ఇదిలా ఉంటే సినిమాలు కూడా లేకపోవడంతో పూర్తిగా ఇంటికే టైమ్ కేటాయిస్తుంది సమంత. మరీ ముఖ్యంగా ఫిజిక్‌పై కూడా ఫోకస్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన డైలీ విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటుంది స్యామ్. ఈ క్రమంలోనే ఉదయాన్నే లేవగానే చేసే కార్యక్రమం గురించి కూడా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

సమంత అక్కినేని (Instagram/Samantha Akkineni)
సమంత అక్కినేని (Instagram/Samantha Akkineni)

పెళ్లి తర్వాత పూర్తిగా కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటుంది సమంత. రంగస్థలం, యూ టర్న్, మజిలీ, ఓ బేబీ, జాను లాంటి సినిమాలే దీనికి నిదర్శనం. విజయాలు వచ్చినా రాకపోయినా తాను మాత్రం పూర్తగిగా కారెక్టర్‌కే ప్రాధాన్యత అంటుంది. మరోవైపు హిందీలో ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కూడా చేసింది. నవంబర్‌లో ఇది స్ట్రీమ్ అవుతుందని తెలుస్తుంది. ఇక అందంపై కూడా సమంత చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఫిట్‌నెస్ కోసం ఎన్నో వ్యాయామాలు చేస్తుంది. జిమ్‌లో కూడా గంటలు గంటలు గడిపేస్తుంది. ఈ వీడియోలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంది ఈ బ్యూటీ.

సమంత అక్కినేని (Instagram/Samantha Akkineni)
సమంత అక్కినేని (Instagram/Samantha Akkineni)

వాటిని చూసి ఆశ్చర్య పోతున్నారు ఆడియన్స్. అసలు సమంత ఉదయం తన దినచర్య ఎలా మొదలు పెడుతుంది.. దీనికి సమాధానం కూడా వచ్చేసిందిప్పుడు. ఉదయం 5 గంటలకు లేచి జాగింగ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత నచ్చిన ఆహారం తిని దానికి తగ్గట్టుగా వ్యాయామాలు చేస్తుంది సమంత. డైటింగ్ అనేది పూర్తిగా చేయకుండా ఉంది సమంత. రోజులో ఎక్కువ సార్లు గోరువెచ్చని నీటిని తాగుతున్నట్లు చెప్తుంది సమంత అక్కినేని. ఏదేమైనా కూడా పొద్దున్నే లేవగానే వ్యాయామంతో పాటు మంచి ఫుడ్ తింటే ఎలాంటి రోగాలు రావని చెప్తుంది స్యామ్. వేడినీరు తాగడం వల్ల మరింత ఆరోగ్యం వస్తుందని ఆరోగ్యసూత్రాలు చెబుతుంది అక్కినేని కోడలు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Samantha akkineni, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు