Home /News /movies /

Samantha Akkineni Akhil: మరిది అఖిల్ కోసం వదిన సమంత అక్కినేని ఏం చేసిందంటే..?

Samantha Akkineni Akhil: మరిది అఖిల్ కోసం వదిన సమంత అక్కినేని ఏం చేసిందంటే..?

అఖిల్, సమంత (Akhil Akkineni Samantha)

అఖిల్, సమంత (Akhil Akkineni Samantha)

Samantha Akkineni Akhil: ఇంటికి కోడలు అన్నపుడు అందరి బాధ్యత తీసుకుంటారు.. తీసుకోవాల్సిందే. ఇప్పుడు అక్కినేని పెద్ద కోడలు సమంత కూడా ఇదే చేస్తుంది. తన మరిది అఖిల్ గురించి కూడా ఇప్పట్నుంచే ఆలోచించడం మొదలు పెట్టింది.

ఇంటికి కోడలు అన్నపుడు అందరి బాధ్యత తీసుకుంటారు.. తీసుకోవాల్సిందే. ఇప్పుడు అక్కినేని పెద్ద కోడలు సమంత కూడా ఇదే చేస్తుంది. తన మరిది అఖిల్ గురించి కూడా ఇప్పట్నుంచే ఆలోచించడం మొదలు పెట్టింది. తన కెరీర్ కూడా సెట్ చేసే పనిలో బిజీగా ఉంది ఈ భామ. ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో అఖిల్ ఫస్ట్ సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నాడు. ప్రస్తుతం ఈయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా విడుదల కోసం చూస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. సినిమా కూడా సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం విడుదలకు ముందే అఖిల్ కెరీర్ సెట్ చేయాలని తన వంతు ప్రయత్నాలు చేస్తుంది సమంత. అందులో భాగంగానే బాలీవుడ్ దర్శక ద్యం రాజ్‌, డీకేలతో అఖిల్ సినిమా సెట్ చేస్తుంది సమంత. వీళ్లు తీయబోయే ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అఖిల్ అయితే బాగుంటాడని వాళ్లను ఒప్పించే పనిలో పడింది అక్కినేని కోడలు. ఈ ఇద్దరి దర్శకత్వంలో ఇప్పుడు ది ఫ్యామిలీ మ్యాన్ 2 చేసింది సమంత. ఇందులో ఆమె టెర్రరిస్టు పాత్ర పోషించింది. ఈ వెబ్‌ సిరీస్‌ను రాజ్‌ డీకేలు తెరకెక్కించారు. ఈ ఇద్దరూ తెలుగు వాళ్లు కావడం గమనార్హం.

samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni movies,samantha akkineni the family man 2 promotions,samantha akkineni raj and dk,samantha akkineni akhil,samantha akkineni akhil raj and dk,samantha akkineni akhil movie,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని అఖిల్,అఖిల్ కోసం సమంత సినిమా ప్రయత్నాలు,రాజ్ డికే అఖిల్ సమంత అక్కినేని
అక్కినేని ఫ్యామిలీ (Source: Twitter)


ఈ క్రమంలోనే వాళ్లు తర్వాత చేయబోయే సినిమా కథను సమంతకు చెప్పగా.. ఈ కథ తన మరిది అఖిల్‌కు అయితే బాగా సెట్టవుతుందని వాళ్లకు చెప్పినట్లు తెలుస్తుంది. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో అఖిల్ అయితే అదిరిపోతాడని వాళ్లకు చెప్పి ఈ ప్రాజెక్ట్ బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడుతుంది సమంత. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత అశ్వినీ దత్ నిర్మించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా మరిది కోసం సమంత కూడా తనవంతు సాయం చేస్తుందన్నమాట. ఏదేమైనా సరే.. అఖిల్‌కు హిట్ వస్తే అక్కినేని కుటుంబం అంతా పండగ చేసుకోవడం ఖాయం.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Akkineni akhil, Samantha akkineni, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు