హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Akkineni: సమంత అక్కినేని విషయంలో అది నిజమే.. షాక్‌లో అభిమానులు..

Samantha Akkineni: సమంత అక్కినేని విషయంలో అది నిజమే.. షాక్‌లో అభిమానులు..

సమంత అక్కినేని (Samantha Akkineni/Instagram)

సమంత అక్కినేని (Samantha Akkineni/Instagram)

Samantha Akkineni: సమంత అక్కినేనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెకు పెళ్లైనా కూడా ఇప్పటికీ స్టార్ హీరోలు కూడా ఈమెతో నటించడానికి సై అంటున్నారు. దర్శక నిర్మాతలు కూడా సమంత కోసం ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నారు.

ఇంకా చదవండి ...

సమంత అక్కినేనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెకు పెళ్లైనా కూడా ఇప్పటికీ స్టార్ హీరోలు కూడా ఈమెతో నటించడానికి సై అంటున్నారు. దర్శక నిర్మాతలు కూడా సమంత కోసం ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నారు. అలాంటి ఇమేజ్ అక్కినేని కోడలు సొంతం. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈమె విలన్‌గా నటించబోతుందని తెలుస్తుంది. గతంలో విక్రమ్ నటించిన 10 ఎంద్రాకుల్లా సినిమాలో ప్రతినాయిక పాత్రలో నటించింది. అందులో ద్విపాత్రాభినయం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఏకంగా మెయిన్ విలన్ రోల్ చేసిందనే ప్రచారం జరుగుతుంది. ఈమె ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌ రెండో సీజన్‌లో సమంత నటించింది. కథ నచ్చడంతో నెగిటివ్ రోల్ చేయడానికి కూడా సిద్ధమైపోయింది సమంత. అందులోనూ ఈమెది టెర్రరిస్ట్ పాత్ర పోషిస్తుందని తెలుస్తుంది. ఇన్ని రోజులు దీనిపై కొన్ని అనుమానాలు ఉండేవి కానీ తాజాగా దర్శకులు రాజ్ డికే ఇచ్చిన సమాధానంతో అదే అని క్లారిటీ వచ్చేసింది.

samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni hot,samantha akkineni hot images,samantha akkineni the family man 2,samantha akkineni the family man season 2,samantha akkineni terrorist role,samantha akkineni hot videos,samantha akkineni web series,samantha akkineni negative role,samantha akkineni villain role,samantha akkineni movies,samantha akkineni hot stills,samantha akkineni nagarjuna,samantha akkineni exposing,telugu cinema,సమంత,సమంత అక్కినేని,సమంత వెబ్ సిరీస్,సమంత టెర్రరిస్ట్,సమంత ఫ్యామిలీ మెన్ టెర్రరిస్ట్,సమంత విలన్ రోల్,సమంత ది ఫ్యామిలీ మ్యాన్,తెలుగు సినిమా
సమంత అక్కినేని (Instagram/Samantha Akkineni)

సమంత ప్రస్తుతం సినిమాల కంటే కూడా డిజిటల్ మీడియాపై ఫోకస్ చేసింది. అందులో భాగంగానే ఆహాలో స్యామ్ జామ్ షో చేస్తుంది. అందులో చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందరినీ ఇంటర్వ్యూలు చేస్తుంది సమంత. టాక్ షోలో చాలా వరకు పర్సనల్ విషయాలను కూడా అడిగి తెలుసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు షోకు తమన్నా వచ్చింది. అందులో ఆమెను కూడా కొన్ని ప్రశ్నలు అడిగింది స్యామ్. దానికి తమన్నా కూడా అలాగే సమాధానమిచ్చింది. మరీ ముఖ్యంగా తన లవ్ విషయం కూడా చెప్పుకొచ్చింది. దాంతో పాటే సమంత వెబ్ సిరీస్ గురించి టాపిక్ వచ్చింది.

samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni hot,samantha akkineni hot images,samantha akkineni the family man 2,samantha akkineni the family man season 2,samantha akkineni terrorist role,samantha akkineni hot videos,samantha akkineni web series,samantha akkineni negative role,samantha akkineni villain role,samantha akkineni movies,samantha akkineni hot stills,samantha akkineni nagarjuna,samantha akkineni exposing,telugu cinema,సమంత,సమంత అక్కినేని,సమంత వెబ్ సిరీస్,సమంత టెర్రరిస్ట్,సమంత ఫ్యామిలీ మెన్ టెర్రరిస్ట్,సమంత విలన్ రోల్,సమంత ది ఫ్యామిలీ మ్యాన్,తెలుగు సినిమా
సమంత అక్కినేని ఫైల్ ఫోటో

అందులో ది ఫ్యామిలీ మెన్ 2 దర్శక ద్వయం రాజ్ డికే లైన్‌లోకి వచ్చి ఇందులో సమంత పాత్ర గురించి రివీల్ చేసారు. అందులో మగాళ్లకు ఏ మాత్రం తీసిపోని పాత్రలో సమంత నటించిందని.. ఆమెకు గ్లామర్ రోల్ కాదని చెప్పుకొచ్చారు. ఫుల్ ఆన్ యాక్షన్ ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఇలాంటి పాత్ర ఇప్పటి వరకు ఎప్పుడూ చేయకపోవడంతో స్యామ్ చాలా ఆసక్తిగా కనిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తైపోయింది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Samantha akkineni, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు