సమంత అక్కినేని ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి తర్వాత కూడా ఈ స్థాయి ఇమేజ్ మెయింటేన్ చేయడం ఈమెకు మాత్యమే సాధ్యమైంది. ఇప్పటికీ అవకాశాలు వస్తున్నా కూడా సమంత కాస్త బ్రేక్ తీసుకుంటుంది. విజయ్ సేతుపతి సినిమా ఒప్పుకున్నా కూడా.. నయనతారతో గొడవ కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకుందనే ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపై ఇంకా సమంత క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వాళ్ళ ఇమేజ్ గురించి చెప్పుకొచ్చింది సమంత. ఫ్లాపులు వచ్చినా కూడా హీరోలకు ఎలాంటి ఢోకా ఉండదని.. కానీ హీరోయిన్లకు మూడు నాలుగు ఫ్లాపులు వస్తే కెరీర్ క్లోజ్ అని చెప్తుంది ఈ ముద్దుగుమ్మ.
హీరోయిన్స్ ఎంత కష్టపడినా ప్రేక్షకులకు నచ్చదని సూటిగానే చెప్పుకొచ్చింది సమంత. ఏదో ఓ సినిమా హిట్ అయింది కదా అని హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు వరసగా తీస్తే ప్రేక్షకులు చూడరని చెబుతుంది ఈమె. అదే ఓ స్టార్ హీరో స్క్రీన్‌పై అలా నడుచుకుంటూ వస్తే చాలు ప్రేక్షకులు పిచ్చెక్కిపోతారు.. హీరోలకు ఉండే క్రేజ్ అలాంటిది మరి అంటుంది అక్కినేని కోడలు. స్టార్ హీరోలకి వరుసగా మూడు నాలుగు ఫ్లాపులు వచ్చినా కూడా ఆడియన్స్ చూస్తారు.. కానీ హీరోయిన్ల విషయంలో అది కుదరదని సుత్తి లేకుండా మ్యాటర్ కుండ బద్ధలు కొట్టింది సమంత అక్కినేని. తన విషయమే తీసుకోండి.. ఓ బేబీ హిట్ అయింది కదా అని తాను సోలోగా నటించిన సినిమాలు హిట్ అవుతాయనే గ్యారెంటీ లేదని చెప్పింది ఈమె. అన్నట్లుగానే యు టర్న్‌తో పాటు జాను సినిమా కూడా డిజాస్టరే.
స్టార్ హీరోకి ఉండే అట్రాక్షన్‌లో కనీసం ఒక శాతం కూడా హీరోయిన్స్‌కి ఉండదని తేల్చేసింది సమంత. ఈమె మాటలు వినడానికి కాస్త కఠినంగా అనిపించినా కూడా ఇదే నిజం. అనుష్క లాంటి హీరోయిన్లకు కూడా ఇప్పుడు గడ్డుకాలం నడుస్తుందంటే సమంత చెప్పిన కారణాలే కరెక్ట్. ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎంత కష్టపడినా వాళ్లకు హీరోలతో సమానమైన గుర్తింపు మాత్రం ఉండదని.. ఎప్పటికీ రాదని చెబుతుంది సమంత. రెమ్యునరేషన్ విషయంలో కూడా హీరో, హీరోయిన్లకు ఆకాశం, భూమికి మధ్య అంత తేడా ఉంటుందని గతంలోనే చెప్పింది సమంత. హీరోలు తమ ఇమేజ్‌తో కలెక్షన్లు తీసుకొస్తున్నపుడు తప్పులేదని కూడా ఆమె సర్దిచెప్పింది. అందుకే మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల ఆధిపత్యం ఉండదని నిజం చెప్పింది సమంత. ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలేవీ లేవు. అందుకే బిజినెస్‌తో బిజీగా ఉంది ఈ భామ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha akkineni, Telugu Cinema, Tollywood