చిన్మయిలో నాకు నచ్చేది అదే అంటున్న సమంత..

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత.. తన స్నేహితురాలు, గాయని చిన్మయి శ్రీపాదకున్న దైర్యాన్ని మెచ్చుకుంది. మీటూ ఉద్యమం నేపథ్యంలో ప్రముఖ పాటల రచయిత వైరముత్తు ఆమెపై చేసిన లైంగిక వేధింపులను బయటపెట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా సమంత.. చిన్మయి ధైర్యాన్ని తనదైన శైలిలో స్పందించింది.

news18-telugu
Updated: June 26, 2019, 5:15 PM IST
చిన్మయిలో నాకు నచ్చేది అదే అంటున్న సమంత..
చిన్మయి శ్రీపాద,సమంత,(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 26, 2019, 5:15 PM IST
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత.. తన స్నేహితురాలు, గాయని చిన్మయి శ్రీపాదకున్న దైర్యాన్ని మెచ్చుకుంది. మీటూ ఉద్యమం నేపథ్యంలో ప్రముఖ పాటల రచయిత వైరముత్తు ఆమెపై చేసిన లైంగిక వేధింపులను బయటపెట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. చిన్మయి.. చేసిన ఆరోపణలకు అప్పట్లో సమంత స్పందించిన సంగతి తెలిసందే కదా. ఇక సమంతకు చిన్మయి ఎప్పటి నుంచో డబ్బింగ్ చెబుతూ వస్తోన్న విషయం తెలిసిందే కదా. తాజాగా సమంత తన ‘ ఓ బేబి’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చిన్మయి గురించి కొన్ని ఆసక్తికరమైన  ప్రశ్నలు ఎదురుయ్యాయి. ఈ సందర్భంగా చిన్మయి ధైర్యాన్ని సమంత వేనోళ్ల పొగిడింది. ఇక విదేశాల్లో ప్రారంభమైన మీటూ ఉద్యమం.. మన దేశంలో తనూశ్రీ దత్త వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో మాత్రం ఈ ఉద్యమానికి చిన్మయి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచింది.

Samantha Akkineni Sensational Comments on Singer Chinmayi Sripada,samantha,chinmayi,samantha akkineni,samantha twitter,samantha instagram,chinmayi sripada,singer chinmayi,Chinmayi Sripada twitter,Chinmayi Sripada instagram,samantha movies,chinmayi about samantha akkineni,samantha chinmayi,chinmayi latest,samantha new movie,akkineni samantha,chinmayi voice,samantha wedding,samantha marriage,samantha latest news,chinmayi sripada samantha,chinmayi and samantha,samantha akkineni to support singer chinmayi,samantha akkineni supports chinmay sripaada,chinmayi samantha,tollywood,telugu cinema,సమంత,సమంత అక్కినేని,చిన్మయి,చిన్మయి శ్రీపాద,చిన్మయి శ్రీపాద,మీటూ ఉద్యమం,
సమంత,చిన్మయి శ్రీపాద


అంతేకాదు వైరముత్తు తర్వాత తమిళనాడు డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిపై కూడా చిన్మయి మీటూ ఆరోపణలు చేసిన తర్వాత ఆమెపై తమిళనాడు డబ్బింగ్ యూనియన్ నిషేధం విధించింది. మరోవైపు తమిళనాడు డబ్బింగ్ యూనియన్‌లోకి ఆమెను తిరిగి తీసుకోవాలంటే రాధారవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ నేపథ్యంలో చిన్మయి కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆమె పై విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా సడలించడంతో ‘ఓ బేబి’ తమిళ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పించేందుకు ఉన్న అడ్డంకులు తొలిగినట్టు సమంత చెప్పుకొచ్చింది.

First published: June 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...