హమ్మయ్యా..ఇక ఆ భారం తొలిగిపోయింద్న సమంత..

సమంత.. అక్కినేని కోడలు కాకముందు నుంచే తనదైన ముద్రతో కథానాయికగా టాలీవుడ్, కోలీవుడ్‌లో సత్తా చూపెట్టింది.

news18-telugu
Updated: November 16, 2019, 9:04 AM IST
హమ్మయ్యా..ఇక ఆ భారం తొలిగిపోయింద్న సమంత..
సమంత(Instagram/samantharuthprabhuoffl)
  • Share this:
సమంత.. అక్కినేని కోడలు కాకముందు నుంచే తనదైన ముద్రతో కథానాయికగా టాలీవుడ్, కోలీవుడ్‌లో సత్తా చూపెట్టింది. పెళ్లైన తర్వాత కూడా కథానాయికగా సమంత జోరు తగ్గలేదు. తాజాగా ఈమె ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో మనం నేర్చుకునేదాని కంటే అనుభవాలే అన్ని నేర్పిస్తాయని చెప్పుకొచ్చింది. ఒక సినిమాలు మరోవైపు కుటుంబాన్ని సమంగా బ్యాలెన్స్ చేస్తూ తన కెరీర్‌‌ను కొనసాగిస్తూ వస్తున్న అని చెప్పింది సమంత. కెరీర్ తొలి నాళ్లనుంచే తనకు అవకాశాలు సక్సెస్‌లు  వెల్లువెత్తినా.. మనసులో మాత్రం ఏదో తెలియని వెలితి ఉండేదనన్నారు. ఆ ప్రయాణం ఎంతో ఒత్తిడితో ఉండేదన్నారు. ఏ రంగంలోనైనా.. అవకాశాలు.. విజయాలు కంటే మించినవి ఎన్నో ఉంటాయి. కెరీర్ ఫస్ట్ డేస్‌లో అంతా బాగున్నట్టే అనిపించేది. కానీ ఏదో తెలియని భారం తనను వెంటాడేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు హీరోయిన్‌ అంటే మొదట్లో ఇలానే ఉండాలి, అలాగే నడుచుకోవాలని కొన్ని రూల్స్ ఉండేవి. అలాగే ఉంటే చాలన్నట్టు ఉండేది పరిస్థితి. అలాంటి స్టేజ్ నుంచి నన్ను నేను ఆవిష్కరించుకునే దశకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అంతేకాదు తాను చేసే పాత్రలతో తెరపై నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నానంది. అందుకే ఒకప్పటిలా చేసే పనిలో భారం, ఒత్తిడి అంతా తొలిగిపోయింద్నారు. దీనికి కారణం.. నాలో వచ్చిన మార్పుతో పాటు.. కుటుంబం, చిత్ర పరిశ్రమలో కొత్త పరిణామాలు అని చెప్పుకొచ్చింది సమంత.

First published: November 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>