సమంత అక్కినేని పెళ్లికి ముందే కాదు తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గానే ఉంది. ఇలాంటి అదృష్టం చాలా తక్కువ మందికే వస్తుంది. నిజానికి ఈ తరం హీరోయిన్లలో ఒక్క సమంత మాత్రమే పెళ్లి తర్వాత కూడా అదే రేంజ్ స్టార్ డమ్ మెయింటేన్ చేస్తుంది. ఇప్పటికీ వరస సినిమాలు కూడా చేస్తుంది. అయితే పెళ్లి తర్వాత ఆమె చేసే సినిమాల్లో కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. మరీ చెప్పాలంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు దగ్గరగా.. గ్లామర్ షోకు పూర్తిగా దూరంగా జరిగింది సమంత అక్కినేని. ఇదిలా ఉంటే పెళ్లికి ముందు మాత్రం కమర్షియల్ హీరోయిన్‌గా రప్పాడించింది సమంత.
కెరీర్ మొదట్లో కొన్ని సినిమాల్లో అంతగా గ్లామర్ షో చేయలేదు. దూకుడు, బృందావనం లాంటి సినిమాల్లో అక్కడక్కడా కాస్త గ్లామర్ షో చేసింది. అయితే ఈమె ఇలాగే ఉంటుందేమో.. ఎక్కువగా ఎక్స్‌పోజింగ్ చేయదేమో అనే అంచనాకు వచ్చేసారంతా. అలాంటి సమయంలో సూర్య హీరోగా నటించిన సికిందర్ సినిమాలో ఏకంగా బికినీ షో చేసింది. బీచ్‌లో ఈమె బికినీ షోతో చూసి అప్పట్లో సోషల్ మీడియా షేక్ అయిపోయింది.
అప్పటి వరకు పద్దతిగా కనిపించిన సమంత.. ఒక్కసారిగా ఉన్నట్టుండి బికినిలో కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. అసలెందుకు సమంత ఇలా నటించిందా అని అంతా కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. దీనికి సమంత చెప్పిన ఆన్సర్ భలే సరదాగా అనిపించింది. కొందరు తాను ఈ పని చెయ్యలేనని.. బికినీ వేయలేనని డిసైడ్ అయిపోయారని.. కానీ వాళ్ల అంచనాలు తప్పని నిరూపించడానికే తాను బికినీ వేసినట్లు చెప్పింది స్యామ్. మొత్తానికి కెరీర్ మొత్తంలో ఒకేసారి బికినీ వేసింది సమంత. కానీ ఆ ఒక్కసారే సంచలనం రేపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha akkineni, Telugu Cinema, Tollywood