సమంత అక్కినేని.. తెలుగులో టాప్ హీరోయిన్. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ అక్కినేని వారింటి కోడలు అయ్యాక పాత్రల ఎంపికలో ఆచీతూచీ వ్యవహరిస్తోంది. నాగచైతన్యను పెళ్లాడిన ఈ సుందరాంగి.. ఈ మధ్యే ఓ బేబీ సినిమాలో నటించి విమర్శకులను సైతం మెప్పించింది. అయితే.. ఓ భారీ ఆఫర్‌ను సమంత తిరస్కరించిందట. తెలుగు, తమిళ భాషల్లో హిట్ అందుకున్న సినిమా ‘యూటర్న్’లో సమంత నటించింది. అయితే.. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్లు సమాచారం. సమంతలా ఎవరు మెప్పిస్తారని వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. తెలుగులో నటించి మంచి పేరు తెచ్చుకున్న సమంతనే హిందీలోనూ నటించాలని చిత్ర బృందం కోరిందట. కానీ, ఈ ఆఫర్‌ను ఆమె తిరస్కరించినట్లు సమాచారం. ఇప్పటికే దక్షిణాది సినిమాల్లో సంతోషంగా ఉన్నానని, ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో నటించే ఆసక్తి లేదని ఆమె స్పష్టం చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలోనూ పలు బాలీవుడ్ ఆఫర్లను సమంత తిరస్కరించింది.
కాగా, సమంత కేరెక్టర్‌లో తాప్సీని తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. అయితే.. అది ఎంత వరకు నిజం అనేది చిత్ర బృందం ప్రకటించాల్సి ఉంది. మరోవైపు.. సమంత శర్వానంద్ సరసన 96 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అమెజాన్ సిరీస్ ది ఫ్యామిలీమ్యాన్-2లోనూ సమంత నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.