Samantha: సమంత అక్కినేని ఆహా ఓటీటీ కోసం హోస్ట్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే కదా. సమంత విషయానికొస్త.. ఓవైపు సినిమాలు.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తూనే సమంత ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు పెళ్లి తర్వాత సమంత సక్సెస్ రేటు కూడా పెరిగింది అంతేకాదు గతేడాది మామ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం వెళితే.. హౌస్ బాధ్యతలను తనపై వేసుకొని ఈ షోను తనదైన శైలిలో నడిపించి వావ్ అనిపించింది. ఇపుడు ‘ఆహా’ ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి తనదైన శైలిలో సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసి సామ్ జామ్ ప్రోగ్రామ్‌కు వన్నె తెచ్చింది. ఎంతో ఆర్భాటంగా ఆహా ఓటీటీలో ప్రసారమైన ‘సామ్ జామ్’ తొలి ట్రైలరర్ విడుదల కాగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి.ఐతే.. ఈ షో ప్రారంభమైన తర్వాత ప్రేక్షకులను నుంచి సరైన స్పందన రావడం లేదనే టాక్ మొదలైంది. దానికి ఓ రీజన్ ఉంది. ఈ ప్రోగ్రామ్ టీవీ ఛానెల్స్‌లో ప్రసారం కాకపోవడం ఒక కారణం. మరోవైపు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఓటీటీ గురించి ప్రజలకు పెద్దగా అవగాహన లేదు.
కేవలం ‘ఆహా’ ఓటీటీ వేదికలో ప్రసారమవుతుండటంతో ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేదనే విషయం స్పష్టమవుతుంది. పైగా ‘ఆహా’ ఓటీటీలో సమంత ఇంటర్వ్యూలు చేసే సెలబ్రిటీలు మెగా, అక్కినేని ఫ్యామిలీస్‌కు సంబంధించిన వాళ్లే ఎక్కువ ఉండటం దీనిపై నెగిటివ్ ఇంపాక్ట్ పడిందని కొంత మంది విశ్లేషిస్తున్నారు. కేవలం సినీ రంగంలో కొంత మంది ఫ్యామిలీ వాళ్లే ఇందులో కనబడుతున్నారు.
ఐతే.. సమంత సామ్ జామ్ ప్రోగ్రామ్ అంతగా పేలకపోవడానికి కారణం చాలానే ఉన్నాయి. ఇప్పటికే ఈటీవీలో గత ఐదారేళ్లుగా ఆలీతో సరదగా ప్రోగ్రామ్‌లో ఆలీ పెద్ద వాళ్ల దగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు అందరినీ ఈ వేదికగా ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నారు. పైగా 40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఆలీకి అటు పాత తరం వాళ్లతో ఇటు కొత్త తరం వాళ్లతో మంచి పరిచయాలే ఉన్నాయి. పైగా ఆలీ .. తెలుగువారింటి సభ్యుడిగా ఎంతో హుందాగా ఈ ఇంటర్వ్యూ నడపడం చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. పైగా యూట్యూబ్‌లో ‘ఆలీతో సరదగా’ ప్రోగ్రామ్‌కు మంచి వ్యూసే దక్కుతున్నాయి.ఇక సమంత చేసే ఈ సామ్ జామ్ ప్రోగ్రామ్ ఆలీతో సరదగా ప్రోగ్రామ్‌తో కంపేర్ చేస్తున్నారు చాలా మంది. సమంత అడిగే ప్రశ్నలు ఆహా ఓటీటీలో చూసే ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదన్నది టాక్.
ప్రేక్షకుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ ప్రోగ్రామ్‌ను ముందుగానే ముగించేస్తున్నట్టు సమాచారం. ముందుగా పది ఎపిసోడ్లకు ప్లాన్ చేసి.. చివరగా 8 ఎపిసోడ్లకే ఈ షోను ఆపివేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. చివరగా సమంత.. తన భర్త నాగ చైతన్యను ఇంటర్వ్యూ చేసిన ఎపిసోడ్‌తో సామ్ జామ్‌కు శుభం కార్డు పడనుంది. అంతకు ముందు అల్లు అర్జున్‌తో సమంత చేసిన చిట్‌చాట్ ప్రేక్షకులను ఏమంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఈ ఎపిసోడ్ రేటింగ్స్ ఆహా వాళ్లను తీవ్రంగా నిరాశపరిచిందని చెబుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వంటి వాటితో తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ అన్ని భాషల్లో కంటెంట్ చూడొచ్చు. కానీ ఆహాలో కేవలం తెలుగుకు సంబంధించిన కంటెంట్ మాత్రమే చూసే అవకాశం ఉండటంతో చాలా మంది ప్రేక్షకులు ‘ఆహా’ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవడానికి మొగ్గు చూపలేదు.సమంత సామ్ జామ్ ప్రోగ్రామ్.. యూట్యూబ్ ఛానెల్స్, సినిమా వార్తలు రాసుకునే వాళ్లకు మాత్రమే ఉపయోగపడింది. మొత్తంగా కామన్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేయడంలో సామ్ జామ్ వెనబడిందనే చెప్పాలి. మొత్తంగా ఈ ప్రోగ్రామ్‌తో సమంత.. రెమ్యునరేషన్ రూపంలో భారీగా వెనుకేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.