స‌మంత అక్కినేని కొడుకును చూసారా.. ప‌క్క‌నే పాతికేళ్ల మ‌న‌వ‌డు కూడా..

అదేంటి.. 30 ఏళ్ల స‌మంత‌కు అప్పుడే మ‌న‌వ‌డు రావ‌డం ఏంటి.. పైగా కొడుకు ఉండ‌టం ఏంటి.. అస‌లు ఏంటీ ర‌చ్చ అనుకుంటున్నారా..? అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉండొచ్చు కానీ ఇదే నిజం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 3, 2019, 6:43 PM IST
స‌మంత అక్కినేని కొడుకును చూసారా.. ప‌క్క‌నే పాతికేళ్ల మ‌న‌వ‌డు కూడా..
ఓ బేబీ సినిమా పోస్టర్
  • Share this:
అదేంటి.. 30 ఏళ్ల స‌మంత‌కు అప్పుడే మ‌న‌వ‌డు రావ‌డం ఏంటి.. పైగా కొడుకు ఉండ‌టం ఏంటి.. అస‌లు ఏంటీ ర‌చ్చ అనుకుంటున్నారా..? అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉండొచ్చు కానీ ఇదే నిజం. పైగా త‌న కొడుకు, మ‌న‌వ‌డిని అభిమానుల‌కు ప‌రిచ‌యం చేసింది కూడా ఎవ‌రో కాదు.. స్వ‌యంగా అక్కినేని కోడలు స‌మంతే. పెళ్లై రెండేళ్లు కూడా కాలేదు అప్పుడే కొడుకు ఎక్క‌డ్నుంచి వ‌చ్చాడు.. మ‌న‌వ‌డు ఎక్క‌డ్నుంచి వ‌చ్చాడ‌నే కంగారు అవ‌స‌రం లేదు. దాని వెన‌క ఓ పెద్ద క‌థే ఉంది. పెళ్లి త‌ర్వాత కూడా స‌మంత వ‌ర‌స సినిమాలు చేస్తూనే ఉంది.

Samantha Akkineni released an interesting poster of Oh Baby movie with Rao Ramesh and Rajendra Prasad pk.. అదేంటి.. 30 ఏళ్ల స‌మంత‌కు అప్పుడే మ‌న‌వ‌డు రావ‌డం ఏంటి.. పైగా కొడుకు ఉండ‌టం ఏంటి.. అస‌లు ఏంటీ ర‌చ్చ అనుకుంటున్నారా..? అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉండొచ్చు కానీ ఇదే నిజం. samantha,samantha twitter,samantha instagram,samantha oh baby,oh baby movie poster,oh baby release date,oh baby teaser,oh baby trailer,oh baby movie,oh baby samantha movie,oh baby telugu movie,oh baby first look,oh baby movie teaser,samantha new movie,oh baby song,samantha oh baby movie,samantha movies,oh baby samantha,oh baby movie songs,oh baby movie review,oh baby movie updates,oh baby songs,oh baby movie release date,oh baby movie teaser review,samantha oh baby,samantha son,samantha grand mother,telugu cinema,సమంత అక్కినేని,సమంత అక్కినేని ఓ బేబీ,సమంత రావు రమేష్,సమంత తేజ,సమంత రాజేంద్ర ప్రసాద్,ఓ బేబీ రిలీజ్ డేట్,తెలుగు సినిమా
ఓ బేబీ పోస్టర్


అందులో భాగంగానే ఇప్పుడు ఓ బేబీ సినిమాతో వ‌స్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ చిత్రం జులై 5న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా సినిమాలోని పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇది త‌న ట్విట్ట‌ర్లో విడుద‌ల చేసి.. సినిమాకు ప్ర‌మోష‌న్ మొద‌లుపెట్టింది స‌మంత అక్కినేని. పైగా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ పేరు కూడా బేబీ అక్కినేనిగా మార్చుకుంది ఈ భామ‌. ఇదిలా ఉంటే ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుద‌ల చేసి.. ‘ఎమోషనల్‌ రోలర్‌కోస్టర్‌ రైడ్‌కు సిద్ధం కండి’ అని ఓ క్యాప్షన్ ఇచ్చింది స‌మంత‌.

అందులో త‌న కొడుకు.. మ‌న‌వ‌డు.. బెస్ట్ ఫ్రెండ్ అంటూ రావు రమేష్, తేజ, రాజేంద్ రప్రసాద్‌లను ప‌రిచ‌యం చేసింది స‌మంత అక్కినేని. ఈ పోస్ట‌ర్ ఇప్పుడు భ‌లే ఆక‌ట్టుకుంటుంది. కొరియ‌న్ సినిమా ‘మిస్‌ గ్రానీ’ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కించింది నందిని రెడ్డి. ఇందులో సీనియర్‌ నటి లక్ష్మి కీలకపాత్రలో న‌టించింది. మొత్తానికి ఈ చిత్రం ప్ర‌మోష‌న్ కోస‌మే ఇప్పుడు కొడుకు, మ‌న‌వడితో క‌లిసి పోజ్ ఇచ్చింది స‌మంత అక్కినేని.
Published by: Praveen Kumar Vadla
First published: June 3, 2019, 6:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading