news18-telugu
Updated: August 9, 2020, 10:28 AM IST
సమంత, రష్మిక (Instagram/Photo)
ఒకే సినిమాలో సమంత, రష్మిక మందన్న కలిసి నటించనున్నారా అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్లో హీరోయిన్ సమంత అక్కినేని గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లికి ముందు వరకు గ్లామరస్ హీరోయిన్గా మెప్పించిన సామ్.. మ్యారేజ్ తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో దూసుకుపోతుంది. అటు కన్నడ కస్తూరి రష్మిక మందన్న గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ‘ఛలో’ మూవీతో అడుగుపెట్టి.. ఆ తర్వాత ‘దేవదాస్’ ‘గీత గోవిందం’ సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ ఇయర్ ఈ భామ మహేష్ బాబుతో నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో పాటు నితిన్‌తో కలిసి యాక్ట్ చేసిన ‘ఛలో’ సినిమాతో వరుస విజయాలు అందుకొని దూకుడు మీదుంది ఈ భామ. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఈ హీరోయిన్స్ ఇపుడు ఓ సినిమాలో కలిసి నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

సమంత, రష్మిక మందన Photo : Twitter
వీళ్లిద్దరు కలిసి నటించబోయే సినిమాలో సమంత, రష్మిక అక్కా చెల్లెల్లుగా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరు కలిసి లేడీ ఓరియంటెడ్ మూవీలో కలిసి నటిస్తున్నారా లేకపోతే.. వేరే హీరోలు నటించే సినిమాలో సిస్టర్స్‌గా నటిస్తున్నారా అనేది తెలియాలి.ఈ సినిమాను ఒకేసారి సౌత్‌లో అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కిస్తారట. ఓ తమిళ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక రీసెంట్గా సమంత .. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కీర్తి సురేష్‌తో పాటు.. రష్మికను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. మొత్తంగా ఈ ఇద్దరు భామలు కలిసి నటించే ఈ చిత్రంపై సౌత్ ఇండస్ట్రీలో అంచనాలు మొదలయ్యాయి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 9, 2020, 10:28 AM IST