నాగ చైతన్య, సమంత పెళ్లి జరిగి రెండేళ్లు గడిచిపోయింది. సాధారణంగా పెళ్లైన ఆర్నెళ్ల నుంచే గుడ్ న్యూస్ ఎప్పుడూ అంటూ కొత్తజంటలకు ప్రశ్నల వర్షం మొదలవుతుంది. చైస్యామ్ సెలెబ్రిటీస్ కాబట్టి రెండేళ్లకు పైగానే టైమ్ ఇచ్చారు అభిమానులు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ ప్రశ్నలు మొదలయ్యాయి. సమంతను ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో కూడా ఈ ప్రశ్న అడిగారు. దానికి స్యామ్ కూడా చాలా తెలివిగా సమాధానం చెప్పింది. తాను తల్లి కావాలనుకున్నపుడు అవుతాను.. దానికి ఏ కారణం అవసరం కూడా లేదు.. మాకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే పేరెంట్స్ అవుతామని సమాధానమిచ్చింది.
అయితే ఇప్పుడు అక్కినేని ఇంట గుడ్ న్యూస్ చెప్పే సమయం దగ్గర పడిందని తెలుస్తుంది. త్వరలోనే అక్కినేని ఫ్యామిలీలోకి కొత్త వ్యక్తి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానని సమంత చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో సమంత ప్రస్తుతం గర్భవతి అంటూ ప్రచారం జరుగుతుంది. అందుకే ఆమె సోషల్ మీడియాకు కూడా కాస్త దూరంగా ఉందని తెలుస్తుంది. ఈ విషయం సమంత, చైతన్య జంటతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులకు.. వాళ్లను ట్రీట్ చేస్తోన్న వైద్యుడికి మాత్రమే తెలుసనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే నటనలో కూడా చాలా బిజీగా ఉంది సమంత. ఈమె ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో విలన్ పాత్ర చేస్తుంది స్యామ్. మరోవైపు సినిమాలు కూడా వరసగా చేస్తూనే ఉంది. వీటి తర్వాత సమంత కొన్ని రోజులు పూర్తిగా సినిమాలకు దూరమైపోనుందనే వార్తలొస్తున్నాయి. తాను తల్లి అయితే మాత్రం కచ్చితంగా సినిమాలకు బ్రేక్ ఇస్తానని అప్పట్లోనే చెప్పింది స్యామ్. ఇప్పుడు అదే చేస్తుందేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి అభిమానుల్లో. మొత్తానికి చూడాలిక.. సమంత చెప్పబోతున్న గుడ్ న్యూస్ ఏంటో మరి..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha akkineni, Telugu Cinema, Tollywood