సమంత అక్కినేని సంచలన జిమ్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్..

సమంత అక్కినేని అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు.. ఫిట్ నెస్ కూడా. ఈమె సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తన ఫిట్ నెస్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 23, 2019, 12:28 PM IST
సమంత అక్కినేని సంచలన జిమ్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్..
సమంత అక్కినేని (Instagram/Photo)
  • Share this:
సమంత అక్కినేని అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు.. ఫిట్ నెస్ కూడా. ఈమె సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తన ఫిట్ నెస్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు తన వర్కవుట్స్ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది అక్కినేని కోడలు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా సమంత పోస్ట్ చేసిన ఓ వర్కవుట్ వీడియో సంచలనాలు సృష్టిస్తుంది. అందులో స్యామ్ చేసిన ఫీట్ చూసి అంతా ఔరా అనుకుంటున్నారు. ఓ పోల్ పట్టుకుని పైకి పాకేస్తుంది సమంత. ఎలాంటి సపోర్ట్ లేకుండా పైకి అలా వెళ్లిన సమంత ఫిట్ నెస్ చూసి అంతా అవాక్కవుతున్నారు.
Samantha Akkineni posted a Sensational gym video on her Instagram and Workout goes viral pk సమంత అక్కినేని అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు.. ఫిట్ నెస్ కూడా. ఈమె సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తన ఫిట్ నెస్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటుంది. samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni facebook,samantha akkineni gym,samantha akkineni gym workout,samantha akkineni gym video,samantha akkineni videos,samantha akkineni hot,samantha akkineni hot videos,samantha akkineni hot scenes,telugu cinema,samantha akkineni 96 remake,samantha akkineni photos,సమంత అక్కినేని,సమంత అక్కినేని జిమ్,సమంత అక్కినేని జిమ్ వర్కవుట్ వీడియోస్,సమంత అక్కినేని సినిమాలు,సమంత అక్కినేని ఇన్‌స్టాగ్రామ్,సమంత జిమ్ వీడియోలు
సమంత అక్కినేని (Source: Twitter)

ఎంతో కష్టపడితే కానీ అలాంటి ఫీట్ చేయడం సాధ్యం కాదు. కానీ సమంత మాత్రం చాలా ఈజీగా దాన్ని ఎక్కేసింది. అంటే ఎన్నో రోజుల కష్టం దాని వెనక ఉందని ప్రశంసిస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్యామ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఇప్పుడు కమెంట్స్‌తో నిండిపోతుంది. తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలు కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది సమంత. ఇప్పుడు కూడా ఇదే చేసింది.


ఈ వీడియో పోస్ట్ చేయడంతో పాటు కింద వివరణ కూడా ఇచ్చింది స్యామ్. కొత్త విషయాలను ప్రయత్నించేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయకండని చెబుతుంది సమంత.. ఎందుకంటే మీకున్న సామార్థ్యాలు చూసి మీరే ఆశ్చర్యపోతారంటూ రాసుకొచ్చింది సమంత అక్కినేని. ఈ వీడియో చూసిన తర్వాత నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న 96 రీమేక్ లో నటిస్తుంది అక్కినేని కోడలు. ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు