సమంత అక్కినేని హోస్ట్‌గా ఉన్న స్యామ్ జామ్ షో బాగానే సక్సెస్ అయింది. మరీ ఆహా అనిపించలేదు కానీ పర్లేదు అనిపించింది. సమంత హోస్టింగ్ కూడా బాగానే సక్సెస్ అయింది. ఇప్పటికే ఈ షోకు చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. స్యామ్ జామ్ అంటూ వాళ్లతో బాగానే ఆడుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, చిరంజీవి లాంటి హీరోలను కూడా ఆడేసుకుంది. వాళ్ల సీక్రేట్స్ అన్ని బయటపెట్టింది. ఇప్పుడు భర్త వంతు వచ్చింది. తొలి సీజన్లో చివరి ఎపిసోడ్ నాగ చైతన్యతో ప్లాన్ చేసారు మేకర్స్. స్యామ్ జామ్ షోలో చివరి ఎపిసోడ్ నాగ చైతన్యతో ఉండబోతుందని తెలిసి అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. కచ్చితంగా ఇందులో కొన్ని ఆసక్తికరమైన సీక్రేట్స్ అయితే బయటికి వస్తాయని తెలుస్తుంది. ముఖ్యంగా చైతూకు సంబంధించిన రహస్యాలను ఒక్కొక్కటిగా బయటికి లాగేందుకు ప్లాన్స్ సిద్ధం చేసుకుంటుంది సమంత. ప్రశ్నలు కూడా అలాగే సిద్ధమయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య ఎపిసోడ్ కోసం పకడ్భందీగా ప్రశ్నాపత్రం రెడీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. పైగా చివరి ఎపిసోడ్ కూడా కావడంతో కచ్చితంగా హైలైట్ అవుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. గత ఎపిసోడ్స్‌తో పోలిస్తే ఈ ఫైనల్ ఎపిసోడ్ పిచ్చెక్కించడం ఖాయంగా కనిపిస్తుంది.
తొలి ఎపిసోడ్లో వచ్చిన విజయ్ దేవరకొండ నుంచి చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి హీరోల నుంచి కూడా చాలా తెలివిగా సీక్రేట్స్ లాగేసుకుంది సమంత అక్కినేని. అలాంటిది ఇప్పుడు వచ్చేది భర్త నాగ చైతన్య.. మరి ఆయన్నెంతగా ఆడుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. చైతూ జీవితంలో ఎవరికీ తెలియని కోణం ఈ షోలో బయటికి రావడం ఖాయంగా కనిపిస్తుంది. అందుకే ఈ ఎపిసోడ్ కోసం అక్కినేని అభిమానులు మాత్రమే కాదు అంతా ఆసక్తిగా చూస్తున్నారు. మరి చూడాలిక.. బుల్లితెరపై ఈ భార్యాభర్తల మ్యాజిక్ ఎలా ఉండబోతుందో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga Chaitanya, Samantha akkineni, Telugu Cinema, Tollywood