స‌మంత కుటుంబంలో విభేదాలు.. అక్కినేని కోడ‌లు ఏం చెప్పిందంటే..

స‌మంత అక్కినేని.. పేరుకు త‌గ్గ‌ట్లే ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం అక్కినేని ఫ్యామిలీతోనే క‌నిపిస్తుంది స‌మంత‌. ఈమె పెళ్లికి ముందు కూడా ఒంటరిగానే క‌నిపించింది కానీ అంద‌రు హీరోయిన్ల మాదిరి అమ్మ‌, నాన్న‌ల‌తో మాత్రం క‌నిపించ‌లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 19, 2019, 12:45 PM IST
స‌మంత కుటుంబంలో విభేదాలు.. అక్కినేని కోడ‌లు ఏం చెప్పిందంటే..
సమంత అక్కినేని ఫైల్ ఫోటో
  • Share this:
స‌మంత అక్కినేని.. పేరుకు త‌గ్గ‌ట్లే ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం అక్కినేని ఫ్యామిలీతోనే క‌నిపిస్తుంది స‌మంత‌. ఈమె పెళ్లికి ముందు కూడా ఒంటరిగానే క‌నిపించింది కానీ అంద‌రు హీరోయిన్ల మాదిరి అమ్మ‌, నాన్న‌ల‌తో మాత్రం క‌నిపించ‌లేదు. ఈ ముద్దుగుమ్మ‌కు త‌న పేరెంట్స్ విష‌యంలో ఏదో స‌మ‌స్య ఉంద‌ని ముందు నుంచి కూడా ఇండ‌స్ట్రీలో వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. స‌మంత‌కు వాళ్ల కుటుంబంతో ప‌డ‌ద‌ని.. దూరంగా ఉంటుంద‌ని.. అమ్మా నాన్న‌ను కూడా దూరంగానే ఉంచింద‌నే ప్ర‌చారం చాలా రోజులుగా జ‌రుగుతుంది.

Samantha Akkineni opens about her family problems and clarity about her issues with mother pk.. స‌మంత అక్కినేని.. పేరుకు త‌గ్గ‌ట్లే ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం అక్కినేని ఫ్యామిలీతోనే క‌నిపిస్తుంది స‌మంత‌. ఈమె పెళ్లికి ముందు కూడా ఒంటరిగానే క‌నిపించింది కానీ అంద‌రు హీరోయిన్ల మాదిరి అమ్మ‌, నాన్న‌ల‌తో మాత్రం క‌నిపించ‌లేదు. samantha akkineni,samantha akkineni instagram,samantha akkineni twitter,samantha akkineni about her mother,samantha akkineni issues in family,samantha,samantha akkineni family,samantha ruth prabhu,samantha naga chaitanya,samantha akkineni family photos,samantha akkineni husband,samantha akkineni lifestyle,samantha akkineni movies,samantha akkineni net worth,samantha akkineni biography,samantha biography,samantha engagement,naga chaitanya mother,akkineni family,samantha akkineni mother,akkineni samantha,samantha interview,actress samantha,telugu cinema,సమంత అక్కినేని,కుటుంబంలో గొడవలపై స్పందించిన సమంత,సమంత తల్లి,తల్లిపై సమంత వ్యాఖ్యలు,తెలుగు సినిమా
అమ్మతో సమంత అక్కినేని


పైగా ఆమె పెళ్లిలో కూడా పెద్ద‌గా వాళ్లు క‌నిపించింది కానీ సంద‌డి చేసింది కానీ లేదు. దాంతో నిజంగానే స‌మంత కుటుంబంలో విభేదాలున్నాయ‌ని అభిమానులు కూడా అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ విష‌యంపై స‌మంత స్పందించింది. త‌న త‌ల్లికి, త‌న‌కు మ‌ధ్య ఏదో గొడ‌వ‌లున్నాయ‌ని మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ పెట్టింది అక్కినేని కోడ‌లు. ఇప్పుడు త‌న సోష‌ల్ మీడియా పేజీలో త‌ల్లి ఫోటో షేర్ చేయ‌డ‌మే కాదు.. త‌న త‌ల్లి ఎప్పుడూ త‌న గురించి దేవున్ని ప్రార్థిస్తూ ఉంటుంద‌ని చెబుతుంది స‌మంత‌.పైగా త‌న తల్లి చేసే ప్రార్ధనలో ఏదో మాయ ఉంటుందని.. ఇప్పుడు కూడా త‌న కోసం దేవున్ని ఏదో ఒక‌టి ప్రార్థించ‌మ‌ని అడుగుతాన‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. పైగా త‌న‌కు మొద‌టి దైవం ఆ దేవుడు అయితే.. రెండో దైవం అమ్మ అంటూ స‌మాధానం ఇచ్చింది స‌మంత అక్కినేని. ఇప్పుడు ఈమె చెప్పిన ఆన్స‌ర్ చాలా మందికి క్లారిటీ ఇచ్చింది. త‌న కుటుంబంలో ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని.. పుట్టింట్లో కూడా త‌న‌కు అంతా బాగానే ఉంద‌ని స‌మంత చెప్పే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లుగా అర్థం అవుతుంది. మ‌రి ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజం ఉంద‌నేది అక్కినేని కోడ‌లికే తెలియాలి.
Published by: Praveen Kumar Vadla
First published: May 19, 2019, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading