news18-telugu
Updated: July 10, 2019, 4:17 PM IST
సమంత (ఫైల్ ఫోటో)
గత కొన్నేళ్లుగా ఒక భాషలో హిట్టైయిన సినిమాను వేరే భాషలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక తెలుగులో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబి’ సినిమా తెలుగు, తమిళ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. నందినీ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీని కొరియాలో హిట్టైన ‘మిస్ గ్రానీ’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఇప్పటికే రూ.20 కోట్ల వరకు రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర స్టడీగా ఉంది. ఒక డెబ్బైయేళ్ల వృద్దురాలు..అనుకోకుండా యంగ్ మారితే జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైయాయి. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి సంయుక్తంగా తెరకెక్కించనున్నట్టు బాలీవుడ్ సమాచారం. ఈ రీమేక్‌లో కంగానా లేదా అలియా భట్ నటించే అవకాశాలున్నాయి.మరోవైపు ఈ సినిమాతో సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనే కసితో ఉంది. మరి యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్లో కూడా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
July 10, 2019, 4:16 PM IST