సమంత అక్కినేని సినిమా అక్కడ విడుదల.. ‘ఓ బేబీ’ ఏం చేస్తుందో..?
సమంత అక్కినేని అంటే కేవలం తెలుగు హీరోయిన్ మాత్రమే కాదు.. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్. ఆమెకు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో తమిళనాట కూడా అంతే ఉంది. అక్కడ కూడా స్యామ్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.

‘ఓ బేబీ’ మూవీ (Source: Twitter)
- News18 Telugu
- Last Updated: August 7, 2019, 2:52 PM IST
సమంత అక్కినేని అంటే కేవలం తెలుగు హీరోయిన్ మాత్రమే కాదు.. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్. ఆమెకు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో తమిళనాట కూడా అంతే ఉంది. అక్కడ కూడా స్యామ్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ క్రేజ్ వాడుకోడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈమె నటించిన ఓ బేబీ సినిమాను ఇప్పుడు తమిళనాట విడుదల చేయడానికి ట్రై చేస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం కొరియన్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్. ఇప్పుడు కూడా లేడీ ఓరియంటెడ్ స్క్రిప్టుల వైపు పరుగులు తీస్తుంది స్యామ్.

తెలుగులో ఈ చిత్రం 38 కోట్ల గ్రాస్.. దాదాపు 15 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళనాట విడుదల చేయనున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం అక్కడ విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. తమిళనాట సమంతకు మంచి ఫాలోయింగ్ వుంది. ఇదే ఇప్పుడు ఈ చిత్ర అనువాదానికి కారణం. అక్కడ ఆమె నటించిన సినిమాలు ఇక్కడ ఫ్లాప్ అయ్యాయి కానీ మన సినిమాలు అక్కడికి వెళ్లి ఏం చేస్తాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
అలా మొదలైంది తర్వాత నందిని రెడ్డికి వచ్చిన హిట్ ఇదే. ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, తేజ కీలక పాత్రల్లో నటించారు. కచ్చితంగా ఈ చిత్రం తమిళనాట కూడా మంచి వసూళ్లు సాధిస్తుందని నమ్ముతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె తెలుగులో శర్వానంద్‌తో 96 రీమేక్‌లో నటిస్తుంది. ప్రేమ్ కుమార్ దీనికి దర్శకుడు. అలాగే మామగారు నాగార్జునతో మన్మథుడు 2లో కూడా అతిథి పాత్రలో కనిపించింది. మొత్తానికి సమంత ఓ బేబీ అరవనేలపై ఏం చేస్తుందో చూడాలి.

సమంత అక్కినేని లేటెస్ట్ ఫోటో షూట్ (ఫైల్ ఫోటో)
తెలుగులో ఈ చిత్రం 38 కోట్ల గ్రాస్.. దాదాపు 15 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళనాట విడుదల చేయనున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం అక్కడ విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. తమిళనాట సమంతకు మంచి ఫాలోయింగ్ వుంది. ఇదే ఇప్పుడు ఈ చిత్ర అనువాదానికి కారణం. అక్కడ ఆమె నటించిన సినిమాలు ఇక్కడ ఫ్లాప్ అయ్యాయి కానీ మన సినిమాలు అక్కడికి వెళ్లి ఏం చేస్తాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

సమంత / Twitter
అలా మొదలైంది తర్వాత నందిని రెడ్డికి వచ్చిన హిట్ ఇదే. ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, తేజ కీలక పాత్రల్లో నటించారు. కచ్చితంగా ఈ చిత్రం తమిళనాట కూడా మంచి వసూళ్లు సాధిస్తుందని నమ్ముతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె తెలుగులో శర్వానంద్‌తో 96 రీమేక్‌లో నటిస్తుంది. ప్రేమ్ కుమార్ దీనికి దర్శకుడు. అలాగే మామగారు నాగార్జునతో మన్మథుడు 2లో కూడా అతిథి పాత్రలో కనిపించింది. మొత్తానికి సమంత ఓ బేబీ అరవనేలపై ఏం చేస్తుందో చూడాలి.
కార్తి ‘దొంగ’ ట్రైలర్ రిలీజ్.. మరోసారి చించేశాడుగా..
నాగార్జున కళ్లు తెరిపించిన మన్మథుడు 2.. అదిరిపోయే ఫ్యూచర్ ప్లాన్..
బిగ్‌బాస్ 4 అంతా సిద్ధం.. హోస్ట్‌గా మళ్లీ ఎన్టీఆర్.. ?
నాగ చైతన్య అక్కినేని.. చరిత్రకు ఒక్కడు.. చరిత్రలో ఒక్కడు..
నా లైఫ్‌లో సమంత తర్వాత ఆ రెండే ముఖ్యమంటున్న నాగ చైతన్య..
77 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ చేసిన పనికి ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్..
Loading...